తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ను , ఆయన నిర్ణయాలను బహిరంగంగా తూర్పారపట్టిన మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు వీడియో మెసేజ్ రిలీజ్ చేసిన మైనంపల్లి హనుమంతరావు త్వరలోనే తాను ఓ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు.
తనతో పాటు కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ కోరిన మైనంపల్లికి తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ రథసారథి కేసీఆర్ నో చెప్పిన సంగతి తెలిసిందే. ఒకే కుటుంబంలో సభ్యులు అయిన కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవిత, సంతోష్‌రావులకు పదవులు దక్కినపుడు తన కుటుంబంలో తన కుమారుడికి మాత్రం ఎందుకు టికెట్ ఇవ్వరంటూ మైనంపల్లి ఘాటుగా నిలదీశారు. అయినప్పటికీ మైనంపల్లిపై కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకోకుండా వేచిచూసే దోరణి అవలంభించారు. అయితే, కేసీఆర్ సంయమనం నేపథ్యంలో గులాబీ దళపతికి తన మార్కు రాజకీయాన్ని మైనంపల్లి రుచి చూపిస్తూ తన అనుచరులతో కేసీఆర్ ను తిట్టించారు.
ఉత్కంఠకు తెరదించుతూ మైనంపల్లి హన్మంత రావు తన నిర్ణయాన్ని వెల్లడించారు. మల్కాజ్‌గిరి ప్రజల కోరిక మేరకు, తన కార్యకర్తల ప్రకారం మరియు రాష్ట్రంలోని శ్రేయోభిలాషుల కోరిక మేరకు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని మైనంపల్లి ప్రకటించారు. ‘ఇంతవరకు మీ అందరి సహకారానికి నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు మరిచిపోను. మల్కాజ్‌గిరి ప్రజలకు రాష్ట్రంలోని నా శ్రేయోభిలాషులందరికీ అండగా ఉంటాను. నా ప్రాణం ఉన్నంత వరకు ప్రజల కోరిక మేరకే ముందుకు నడుస్తాను…దేనికి లొంగే ప్రసక్తే లేదని తెలియజేస్తున్నాను. తప్పకుండా తగిన సమయంలో ఏ పార్టీలో చేరేది తెలియజేస్తాను. ‘ అని మైనంపల్లి వెల్లడించారు.
అయితే, కాంగ్రెస్ పార్టీ వైపు మైనంపల్లి హన్మంతరావు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి సెప్టెంబర్ 17న సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ సమక్షంలో అధికారికంగా పార్టీలో చేరవచ్చని అంచనాలు వెలువడ్డాయి. ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో చర్చలు జరగగా, తనతో పాటే తన కుమారుడిని కాంగ్రెస్ టికెట్‌పై పోటీకి దించేందుకు మైనంపల్లి హామీ పొందినట్లు సమాచారం. ఇటీవలే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో మైనంపల్లి సూచనల మేరకు రహస్యంగా మైనంపల్లి ముఖ్య అనుచరుడు నక్క ప్రభాకర్‌గౌడ్ భేటీ అయ్యారట. మేడ్చల్ టికెట్ విషయంలో ప్రభాకర్‌గౌడ్‌కి రేవంత్ హామీ ఇచ్చారని సమాచారం. స్థూలంగా తనకు, తన కుమారుడికి, అంతే కాకుండా ముఖ్య అనుచరుడికి టికెట్ విషయంలోనూ మైనంపల్లి హామీ పొందినట్లు తెలుస్తోంది.
This post was last modified on September 22, 2023 11:31 pm
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…