దశాబ్దాల తరబడి కలలు కన్న సొంత రాష్ట్రాన్ని ఇచ్చినా దాదాపు పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న ఆ పార్టీ.. ఇప్పుడు రాష్ట్రంలో అధికారాన్ని సొంతం చేసుకోవాలని తపిస్తోంది. ఇందుకోసం కిందా మీదా పడుతున్నారు. ఈసారి ఎన్నికల్లో తమ సత్తా చాటని పక్షంలో పార్టీకి జరిగే డ్యామేజ్ భారీగా ఉంటుందన్న మాట బలంగా వినిపిస్తోంది.
త్వరలో జరిగే ఎన్నికల్లో తెలంగాణలో గెలుపు కాంగ్రెస్ కు చాలా ముఖ్యమన్న విషయం ఆ పార్టీకి తెలియనిది కాదు. అందుకే.. అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేసేందుకు భారీగానే కసరత్తు చేస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే తొలిజాబితాను విడుదల చేస్తారని చెబుతున్నారు. మొదటి జాబితాలో 30-35 పేర్ల వరకు ఉండొచ్చన్న మాట వినిపిస్తోంది.
మొత్తంగా నాలుగైదు జాబితాలు ఉండొచ్చని చెబుతున్నారు. తొలి జాబితాలో బలమైన.. ముఖ్యమైన అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారని చెబుతున్నారు. తాజాగా జరిగిన భేటీ ఎనిమిది గంటల పాటు సాగడం గమనార్హం. మొత్తం 119 స్థానాల్లో టికెట్లు ఆశిస్తున్న వారి జాబితాను 300 మందికి షార్ట్ లిస్టు చేసినట్లుగా తెలుస్తోంది. ఇందులో ఒకే ఒక్క అభ్యర్థి బరిలో ఉన్న నియోజకవర్గాలు 30-35 వరకు ఉన్నాయని.. రెండేసి పేర్లు ఉన్న స్థానాలు 20-30 మధ్య.. ముగ్గురు చొప్పున పోటీ పడుతున్న స్థానాలు 30-35 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక.. నలుగురికి పైనే టికెట్లు ఆశిస్తున్న స్థానాలు దాదాపు పది వరకు ఉన్నాయని.. వాటి విషయంలో చివర్లో నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.
ఒకే ఒక్కఅభ్యర్థి బరిలో ఉన్న జాబితాను ఇప్పటికే పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదానికి పంపారు. అక్కడి నుంచి ఓకే అన్న మాట వచ్చినంతనే తొలి జాబితాను విడుదల చేస్తారని చెబుతున్నారు. ఈ నెలాఖరుకు మొదటి జాబితాను.. వచ్చే నెల మొదటి వారంలో రెండో జబితాను.. రెండో వారంలో మూడో జాబితాను ప్రకటిస్తారని చెబుతున్నారు. ఏదైనా పీటముడి పడితే మాత్రం నాలుగో విడతలో అభ్యర్థుల్ని ఫైనల్ చేసే అవకాశం ఉందంటున్నారు.
వరుసగా మూడుసార్లు ఓడిన వారికి మాత్రం టికెట్ ఇవ్వకూడదని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. అలాంటి నియోజకవర్గాలు దాదాపు ఆరేడు వరకు ఉన్నాయమంటున్నారు. టికెట్ల ఎంపికలో సర్వే రిపోర్టులను ప్రాధామ్యాయాలుగా తీసుకుంటారని చెబుతున్నారు. తొలి జాబితాలో వెల్లడయ్యే అభ్యర్థుల విషయానికి వస్తే.. ఇప్పటికే గుర్తింపు పొందటంతో పాటు.. బలమైన నేతలుగా ఉన్న వారే ఉన్నారు. వారెవరంటే..
This post was last modified on September 22, 2023 10:34 am
‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఎంత డీగ్లామరస్‌గా కనిపిస్తాడో తెలిసిందే. ఒక ఎర్రచందనం కూలీ పాత్ర కావడంతో అందుకు తగ్గట్లు…
కోలీవుడ్‌లో చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకున్న దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్‌కు సంబంధం లేకుండా.. అంచనాలు…
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…
క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులకు, ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులకు మధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…