ఏపీ అధికార పార్టీ వైసీపీ సీనియర్ నాయకుడు, మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. చంద్రబాబు అరెస్టు, జైలులో పెట్టడం పట్ల ఆసేతు హిమాచలం ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. మహిళలు, వృద్ధులు కూడా రోడ్లమీదకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నాయకులు, ఎన్నారైలు.. రిలే నిరాహార దీక్షలు చేస్తూ..చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ విషయంపై మౌనంగా ఉండాల్సిన మంత్రి ధర్మాన.. ఈ నిరసనలను, ఆవేదనను తక్కువ చేసి మాట్లాడారు.
“చంద్రబాబు జైలుకు వెళ్లడాన్ని పెద్దది చేసి చూస్తున్నారు. ఇప్పటికి ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్లు కూడా జైళ్లకు వెళ్లారు. అంతెందుకు మన ముఖ్యమంత్రి జగన్ కూడా జైలులో ఉండి వచ్చారు. నేను కూడా.. అనేక కేసుల్లో కోర్టు మెట్లు ఎక్కాను. కానీ, చంద్రబాబును జైల్లో పెడితే.. ఏదో జరిగిపోయినట్టు నిరసన చేస్తున్నారు. ఇదంతా ఎందుకు? ఎందుకు చేస్తున్నట్టు” అని ధర్మాన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
సీఎం జగన్ 16 మాసాలు జైల్లో ఉన్నదానికి, చంద్రబాబును ఇప్పుడు జైల్లో పెట్టడానికి పోలిక ఏమైనా ఉందా ధర్మాన సార్? అంటూ.. కొందరు నిప్పులు చెరిగారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్షల కోట్లు దోచుకున్న కేసులో జగన్ జైలు జీవితం గడిపారని.. ఇది తప్పని, తాను అవినీతికి పాల్పడలేదని ఆయన ఒక్క మాటైనా ఇప్పటి వరకు చెప్పారా? ఆయన జైలుకు వెళ్తే.. నిరసనగా ఏ ఒక్కరైనా రోడ్డెక్కారా? అని పలువురు ప్రశ్నించారు.
ధర్మాన సీనియర్ నాయకుడు, ఎంతో మేధావి అనుకున్నామని.. కానీ, ఇలా కుశ్చిత మనస్తత్వంతో వ్యాఖ్యానిస్తారని అనుకోలేదని మరికొందరు వ్యాఖ్యానించారు. ధర్మాన కేసులకు, చంద్రబాబు కేసులకు సంబంధం ఉందా? అని ఇంకొందరు ప్రశ్నించారు. మొత్తానికి సీనియర్ నేతపై నెటిజన్లు సీరియస్‌గానే కామెంట్లు చేస్తుండడం గమనార్హం.
This post was last modified on September 18, 2023 1:51 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…