ఏ మాత్రం అవకాశం దొరికినా అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ తమ ప్రతిష్టాత్మక సిడబ్ల్యుసి సమావేశాలకు హైదరాబాద్‌ను వేదికగా చేసుకున్న సంగతి తెలిసింది. కాంగ్రెస్ అగ్ర నేతలంతా విచ్చేసి అట్టహాసంగా జరుగుతున్న ఈ సమావేశాల సమయంలో తెలంగాణలో పోస్టర్ల కలకలం జరిగింది. కాంగ్రెస్ పార్టీలోని సిడబ్ల్యుసి సభ్యులంతా అవినీతిపరులని పేర్కొంటూ హైదరాబాద్ లోని పలుచోట్ల పోస్టల్ దర్శనమిచ్చాయి. ఈ పరిణామం సహజంగానే రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ శ్రేణులు కలవరపాటుకు గురయినప్పటికీ, పీసీసీ ఛీఫ్ రేవంత్ సారథ్యంలోని దీనికి రియాక్షన్ సిద్ధమైందని సమాచారం.
కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతల వేదికైనా సిడబ్ల్యూసీలోని పలు స్కామ్‌లను వివరిస్తూ హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలతో పోస్టర్లు వెలిశాయి. సహజంగానే ఈ పోస్టర్లు వైరల్ గా మారాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ ఈ పోస్టుల వెనుక ఉందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణలు వ్యక్తం చేశారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీ స్పందించలేదు. అయితే, ఈ పోస్టులను ఎలా కాంగ్రెస్ ఎదుర్కోనుందని ప్రశ్న వ్యక్తం అవుతుండగా ఆ పార్టీ ప్రణాళిక సిద్ధం చేసిన సమాచారం
తన పార్టీని జాతీయ పార్టీగా మార్చి చక్రం తిప్పాలనుకుంటున్న గులాబీ దళపతి కేసీఆర్ అందుకు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రను క్షేత్రంగా ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అక్కడ పలు సభలు, వివిధ కార్యక్రమాలను కేసీఆర్ నిర్వహించారు. ఇప్పుడు అదే మహారాష్ట్రలో పోస్టర్ వార్‌లో తమ కౌంటర్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జిగా ఉన్న మాణిక్‌రావు ఠాక్రే సొంత ఇలాక అయిన మహారాష్ట్రలో కేసీఆర్ టూర్లు, సభలు ఉన్నప్పుడు ఆయన పాలనలోని అవకతవకలను పేర్కొంటూ పోస్టర్లు వేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో కేసీఆర్ ఏలుబడిలో వివిధ ప్రాజెక్టులు, పలు విధానపరమైన నిర్ణయాల్లో జరిగిన అవినీతిని పేర్కొంటూ భారీ స్థాయిలో పోస్టర్లు ప్రచురితం చేసి కేసీఆర్‌కు గట్టి కౌంటర్ చేయాలని ప్రణాళిక రచించారని సమాచారం. కేసీఆర్ పర్యటన మహారాష్ట్రలో ఉన్నప్పుడు తప్పనిసరిగా ఈ మేరకు పోస్టర్లు వేయాలని రేవంత్ నాయకత్వంలోని తెలంగాణ నేతలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on September 16, 2023 10:18 pm
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…
జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…
ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చరిక చేసింది. ఆయన తప్పు చేసినట్టు నిరూపితమైతే.. కచ్చితంగా…
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…