Political News

బీఆర్ ఎస్‌కు త‌మ్ముల గుడ్‌బై.. కాంగ్రెస్‌తో జోడీకి రెడీ!

బీఆర్ ఎస్ పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. కేవ‌లం రెండు వాక్యాల‌తో కూడిన రాజీనామా ప‌త్రాన్ని బీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు పంపించారు. “తెలంగాణ రాష్ట్ర స‌మితిలో నాకు స‌హ‌క‌రించినందుకు ధ‌న్య‌వాదాలు. పార్టీకి నా రాజీనామాను స‌మ‌ర్పిస్తున్నాను” అని మాత్ర‌మే ఆయ‌న పేర్కొన్నారు. అంత‌కు మించి.. త‌న రాజీనామాకు కార‌ణాలు కానీ.. ఈ సంద‌ర్భంగా పార్టీపై విమ‌ర్శ‌లు కానీ ఆయ‌న చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఎవ‌రీ తుమ్మ‌ల‌?

తెలంగాణ రాజ‌కీయాల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్న నాయ‌కుడు తుమ్మల నాగేశ్వ‌ర‌రావు. సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానం ఉన్న తుమ్మ‌ల ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా పాలేరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు. వ్య‌వ‌సాయ కుటుంబానికి చెందిన ఆయ‌న గ‌తంలో టీడీపీలో ఉన్న స‌మ‌యంలో ఉమ్మ‌డి జిల్లాలో కాంగ్రెస్‌తో సై అంటే సై అంటూ.. రాజ‌కీయ పోరాటా ల‌కు తెర‌దీసిన నాయ‌కుడిగా ఆయ‌న‌కు పేరుంది. వాస్త‌వానికి ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో కమ్యునిస్టుల ప్ర‌భావం ఎక్కువ‌.

అలాంటి జిల్లాలో తెలుగు దేశం పార్టీ జెండాను రెప‌రెప‌లాడించ‌డంలో తుమ్మ‌ల పాత్ర‌ను త‌క్కువగా అంచ‌నా వేయ‌లేం. అలాంటి నాయ‌కుడు రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. బీఆర్  ఎస్ పార్టీలో చేరారు. ఆయ‌న ఓడిపోయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌విని ఇచ్చిన కేసీఆర్‌.. భ‌క్త‌రామ‌దాసు సాగు, తాగు నీటి ప్రాజెక్టు నిర్మాణ బాధ్య‌త‌ల‌ను కూడా ఆయ‌న‌కే అప్ప‌గించారు. దీనిని స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించ‌డం తుమ్మ‌ల‌కు అప్ప‌ట్లో మంచి పేరు తెచ్చింది.

ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో  కాంగ్రెస్ త‌ర‌ఫున గెలిపిన కందాల ఉపేంద‌ర్‌రెడ్డి బీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్న త‌ర్వాత నుంచి తుమ్మల ప్ర‌భావం ఆ పార్టీలో త‌గ్గుతూ వ‌చ్చింది. త‌ర్వాత త‌ర్వాత‌.. కేసీఆర్ కు కూడా ఆయ‌న దూర‌మ‌య్యారు. ఇక ఈ క్ర‌మంలోనే తాజాగా ఆయ‌న కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో జ‌రుగుతున్న సీడ‌బ్ల్యూసీ స‌మావేశాల్లోనే ఆయ‌న సోనియా గాంధీ, మ‌ల్లికార్జున ఖ‌ర్గేల స‌మ‌క్షంలో హ‌స్తం పార్టీ గూటికి చేర‌నున్న‌ట్టు తెలుస్తోంది. 

This post was last modified on September 16, 2023 1:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago