తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారం రాజకీయంగా పెద్ద దుమారానికే దారి తీసింది. ప్రధానంగా తెలుగుదేశం వెర్సస్ వైఎస్సార్ కాంగ్రెస్ అన్నట్లుగా ఉండాల్సిన వ్యవహారం కాస్తా.. తెలుగుదేశంతో బంధం ఉన్న రెండు కుటుంబాల్లో చిచ్చుగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. నందమూరి వెర్సస్ నారా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ విషయం పెద్ద చర్చకు తావిస్తోంది.
చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ తారక్ ప్రకటన చేయకపోవడంపై తెలుగుదేశంలోనే ఒక వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. పార్టీ నుంచి తారక్‌ను పూర్తిగా దూరం పెడుతున్నపుడు అతనెందుకు ఖండన ఇవ్వాలి అంటూ మరో వర్గం వాదిస్తోంది. ఇదిలా ఉంటే.. తారక్ మీద విషం చిమ్ముతూ సోషల్ మీడియాలో కొన్ని హ్యాండిల్స్ అదే పనిగా పోస్టులు పెడుతుండటం.. అలాగే మీడియాకు కూడా తారక్‌కు వ్యతిరేకంగా బైట్స్ ఇస్తుండటం గమనార్హం.
తారక్ జగన్‌తో చేతులు కలిపాడని.. ఆ మధ్య తనను కలిసిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సంప్రదింపులు జరుపుతున్నాడని.. చంద్రబాబు అరెస్ట్ వెనుక తారక్ ఉన్నాడని.. ఇలా రకరకాలుగా పోస్టులు పెడుతోంది ఈ వర్గం. ఇలా తారక్ మీద నెగెటివ్ పోస్టులు పెట్టి తెలుగుదేశంలో బాబు, లోకేష్‌లను మద్దతుగా నిలిచే వర్గాన్ని బ్యాడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఐతే ఇదంతా వైసీపీని తెర వెనుక ఉండి నడిపించే ఐప్యాక్ టీం పనే అని తెలుగుదేశం వర్గాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా వైరల్ అయిన ఒక వీడియోలో తారక్‌ను తిట్టిపోసిన మహిళ వైసీపీ కార్యకర్త అని ఈ వర్గాలు చెబుతున్నాయి. తెలుగుదేశం వాళ్ల పేరుతో ఇలా కొందరిని రంగంలోకి దించి తారక్ మీద విషం చిమ్మడం తద్వారా తెలుగుదేశం వాళ్లే వర్గాలుగా విడిపోయి కొట్టుకోవడం ఈ కాన్సెప్ట్ లక్ష్యమని వాళ్లు ఆరోపిస్తున్నారు.
This post was last modified on September 13, 2023 10:22 pm
బాలీవుడ్ డెబ్యూ స్పెషల్ గా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ఎందుకంటే అదిచ్చే ఫలితాన్ని బట్టే మార్కెట్ తో పాటు అవకాశాలు…
ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ లో నటించాక ఏ హీరోయిన్ కైనా ఆఫర్ల వర్షం కురుస్తుంది. కానీ కెజిఎఫ్ రెండు భాగాల్లో…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి రెండు పెద్ద సినిమాలు సెట్స్ మీదుంచి వాటిని బ్యాలన్స్ చేయడం ఎంతటి అగ్ర నిర్మాతలకైనా సరే…
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న గాలి భానుప్రకాష్ నాయుడు.. దూకుడు ప్రదర్శిస్తున్నారు. యువ ఎమ్మెల్యేగా…
ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల సమయంలోనూ.. తర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ ప్రశ్న…