న్యాయం కనుచూపు మేరలో కూడా కనిపించనప్పుడు కత్తి పట్టడమే మేలు అంటున్నారు చంద్రబాబు తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేతను అరెస్ట్ చేసిన వెంటనే లాయర్ లూథ్రా ఢిల్లీ నుంచి చంద్రబాబు వైపు ఆయన వాదనలు వినిపించడానికి ఏపీకి చేరుకున్నారు.
ఈ క్రమంలో ఆయన వాదనలు వినిపించిన తరువాత బాబుకు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయన తిరిగి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయన చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ న్యాయం అనేది కనుచూపు మేరలో కూడా కనిపించనప్పుడు కత్తి పట్టడమే మేలు అంటూ ఆయన పోస్ట్ చేశారు.
ఈ మాటలకు సంబంధించిన ఓ ఫోటోను కూడా ఆయన పోస్ట్ చేశారు. అది ఏంటి అంటే ఉర్దూలో గురుగోవింద్ సింగ్ ప్రస్తావించిన మాటల చిత్రాన్ని ఆయన ఆ పోస్ట్ కు ట్యాగ్ చేశారు. ఏసీబీ కోర్టులో రిమాండ్ అవసరం లేదని ఆయన ఎంతగా వాదించినప్పటికీ బాబుకి న్యాయమూర్తి రిమాండ్ విధించారు.
ఈ నేపథ్యంలో ఆయన ఈ ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీని కంటే ముందు ఆయన “ఏపీ మాజీ సీఎం చంద్రబాబు కేసులో వాదించడం కోసం శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి విజయవాడలో వేచి ఉన్నాను. ఈ న్యాయవాద వృత్తిలో ఎప్పుడూ నిస్తేజంగా ఉండకూడదు!” అని ట్వీట్ చేశారు.
This post was last modified on September 13, 2023 11:20 pm
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…