బీజేపీలో చేరాలని అనుకున్న క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ కుమార్ కు బ్రేకులు పడ్డాయి. పార్టీలో చేరేందుకు చికోటి అన్నీ ఏర్పాట్లు చేసేసుకున్నారు. కేంద్రమంత్రి, తెలంగాణా అద్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకునేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాంపల్లిలోని పార్టీ ఆఫీసు ముందు భారీ కటౌట్లు కూడా ఏర్పాటుచేసుకున్నారు. పేపర్లలో పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇచ్చుకున్నారు. వందలాది వాహనాల్లో మంగళవారం మధ్యాహ్నం పార్టీ ఆఫీసుకు వెళ్ళిన చికోటికి విచిత్రమైన పరిస్ధితి ఎదురైంది.
ఆ పరిస్ధితి ఏమిటంటే చికోటి పార్టీ ఆఫీసుకు చేరుకునే సమయానికి సీనియర్లు కాదు కదా చివరకు కిషన్ రెడ్డి కూడా లేరు. పార్టీ ఆఫీసులో ఒక్కరంటే ఒక్క సీనియర్ నేత కనబడలేదు. దాంతో చికోటికి షాక్ కొట్టినట్లయ్యింది. పార్టీలో చేరటానికి ఎంతో అట్టహాసంగా ఏర్పాట్లు చేసుకుని వస్తే ముందుగా మాట్లాడుకుని వచ్చిన తర్వాత కూడా ఎవరు లేకపోవటం ఏమిటో క్యాసినో కింగ్ కు అర్ధంకాలేదు. అయితే దాన్ని సమర్ధించుకునేందుకు తనకు పార్టీలోని ముఖ్యులకు ఏదో మిస్ కమ్యూనికేషన్ వచ్చినట్లు ప్రకటించారు.
ఈ సమస్యను తొందరగానే క్లియర్ చేస్తానని పార్టీలో చేరికపై బుధవారం రాత్రిలోగా క్లారిటి ఇస్తానని తన మద్దతుదారులకు చెప్పుకున్నారు. తర్వాత ఎలా వచ్చారో అలాగే తిరిగి వెళ్ళిపోయారు. అయితే పార్టీ వర్గాల సమాచారం ఏమిటంటే చికోటి అంటే క్యాసినో కింగ్ అనే పాపులర్. విదేశాలకు బృందాలను తీసుకెళ్ళి క్యాసినోలు ఆడించి బాగా డబ్బు సంపాదించినట్లు ఆరోపణలున్నాయి.
థాయిల్యాండులో క్యాసినో ఆడుతుండగా పోలీసులు చికోటిని అరెస్టు చేసిన విషయం అప్పట్లో తెలుగురాష్ట్రాల్లో సంచలనంగా మారింది. చికోటి ఎంత పాపులరైనా నెగిటివ్ గా పాపులరయ్యారు కానీ పాజిటివ్ గా కాలేదు. ఇపుడు చికోటి దగ్గర డబ్బుందని, మద్దతుదారులుంటారని పార్టీలో చేర్చుకుంటే దాని ప్రభావం పార్టీపైన నెగిటివ్ గానే పడుతుందని సీనియర్లు అనుమానించారని సమాచారం. ఈ కారణంగానే బీజేపీలో చికోటి చేరిక విషయంలో పార్టీ ఆఫీసులో విచిత్రమైన వాతావరణం కనబడింది. మరి ఈరోజు రాత్రం చికోటి ఇవ్వబోయే క్లారిటి ఏమిటన్నది ఆసక్తిగా మారింది.
This post was last modified on September 13, 2023 11:19 am
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…
ఏపీలో కూటమి సర్కారు అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం రికార్డ్ సృష్టించింది. గత ఏడాది ప్రారంభించిన ఈ పథకం…
అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…
ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…