ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీకి అతిపెద్ద సమస్య జగన్ అని, విభజన గాయాల కంటే జగన్ రాష్ట్రాన్ని నాశనం చేసిన గాయమే ఎక్కువ అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ఓడిపోతేనే రాష్ట్రం బాగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ విధానాల వల్లే తెలంగాణకు, ఆంధ్రకు అభివృద్ధిలో పొంతన లేకుండా పోయిందని దుయ్యబట్టారు. తాను గేట్లు తెరిస్తే వైసీపీ ఉండదని, ఆ పార్టీ టిడిపిగా మారిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక, బీజేపీతో పొత్తులపై చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. బిజెపితో అంతర్గతంగా ఏం చర్చిస్తున్నాం అనే విషయం ఎవరికీ తెలియదని చెప్పారు. తాను చూడని రాజకీయం లేదని, దేశ నిర్మాణంలో భాగం కావడమే తన ఉద్దేశమని అన్నారు. అది ఏ విధంగా, ఎలా అనేది కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. ఇక, తెలంగాణలో బీజేపీతో పొత్తులు లేవని చంద్రబాబు తేల్చి చెప్పేశారు. ఆ పార్టీతో కలిసి వెళ్లేందుకు సమయం మించిపోయిందని, తెలంగాణలో టిడిపి ఒంటరిగానే బరిలోకి దిగుతుందని చంద్రబాబు ప్రకటించారు. ప్రత్యేక హోదా కోసమే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చానని, హోదా ఏపీ ప్రజల సెంటిమెంట్ అని చెప్పారు.
ప్రత్యేక హోదా విషయంలోనే కేంద్రంతో తాను విభేదించానని మిగతా విషయాలలో తనకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని క్లారిటీని ఇచ్చారు ఇదే విషయాన్ని తన గతంలో చాలా సార్లు చెప్పానని చంద్రబాబు అన్నారు.టిడిపి జాతీయభావంతో ఉండే పార్టీ అని, జాతీయ రాజకీయాలతో టీడీపీకి ఎల్లప్పుడూ ప్రత్యేక అనుబంధం ఉంటుందని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే విషయంపై కమిటీ ఏర్పాటు చేశామని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు ఏడుగురు సభ్యులతో చంద్రబాబు కమిటీని నియమించిన సంగతి తెలిసింది. ఏపీని ఎలా పునర్మించాలి అనే ఆలోచనతో ఉన్నానని చంద్రబాబు అన్నారు.
This post was last modified on August 30, 2023 11:14 am
దేశ భద్రతపై మళ్లీ శాంతిభంగం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయని నిఘా సంస్థలు హెచ్చరించాయి. శనివారం కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు…
రెండేళ్ల క్రితం బేబీ రిలీజ్ ముందు వరకు తనెవరో పెద్దగా పరిచయం లేని పేరు. అల వైకుంఠపురములో అల్లు అర్జున్…
తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ... అధికార డీఎంకేలో ఫుల్ జోష్ నింపే పరిణామం ఒకటి శనివారం జరిగింది. సుప్రీంకోర్టులో రెండేళ్లుగా…
హర్యానాలోని సోనిపట్‌లో ఉన్న ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థి చేసిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ అవుతోంది.…
మాజీ ఉప రాష్ట్రపతి, బీజేపీ నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు.. తాజాగా అటు తెలంగాణ, ఇటు ఏపీ నేతలపై సెటర్లు గుప్పించారు.…
కొన్నిసార్లు బాక్సాఫీస్ ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి. టాక్ తేడాగా వచ్చినా, జనానికి పూర్తిగా నచ్చకపోయినా కలెక్షన్లు మాత్రం భీభత్సంగా వచ్చేస్తాయి.…