తెలంగాణలో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. ఇంకా షెడ్యూల్ విడుదల కానప్పటికీ అభ్యర్థుల ప్రకటన, దరఖాస్తుల ప్రక్రియ, చేరికలు అంటూ పార్టీలన్నీ హడావుడి చేస్తున్నాయి. ఇప్పటికే 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్.. రేసులో ముందుంది. ఇక అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్.. టికెట్లు ఆశించే వాళ్ల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఇప్పుడు వీటిని వడబోసే కార్యక్రమం మొదలైంది. మొదట తెలంగాణలో ప్రదేశ్ ఎన్నికల కమిటీ ఈ దరఖాస్తులను పరిశీలించి ఒక్కో సీటుకు ముగ్గురిని ఎంపిక చేయనుంది. ఆ తర్వాత ఢిల్లీలోని పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ తుది అభ్యర్థులను ఖరారు చేస్తే.. అధిష్ఠానం జాబితా ప్రకటిస్తుంది.
తెలంగాణలోని 119 ఎమ్మెల్యే స్థానాలకు గాను కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు 1,025 దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. వీటిలో 34 స్థానాలకు 10కి పైగా దరఖాస్తులు వచ్చాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇల్లెందు నియోజకవర్గంలో టికెట్ కోసం అత్యధికంగా 34 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. ఇప్పుడీ దరఖాస్తులను పరిశీలించే ప్రక్రియలో తెలంగాణలోని ప్రదేశ్ ఎన్నికల కమిటీ మునిగిపోయింది. ఆయా నియోజకవర్గంలోని నేతల బలాబలాలు, అక్కడి పరిస్థితి, ఎవరికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉంటుంది.. ఇలా తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఒక్కో సీటుకు గరిష్ఠంగా ముగ్గురిని ఈ కమిటీ ఎంపిక చేస్తుందని సమాచారం.
ఒక్కో స్థానానికి ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేసి, త్వరలోనే జాబితా పంపించాలని అధిష్ఠానం నుంచి టీపీసీసీకి ఆదేశాలు అందినట్లు తెలిసింది. ఈ జాబితా తయారైన తర్వాత కేంద్ర ఎన్నికల కమిటీ రంగంలోకి దిగుతుంది. ఆ ముగ్గురు అభ్యర్థుల పరిస్థితిని అంచనా వేసి ఇందులో నుంచి ఒకరిని ఎంపిక చేస్తుంది. అధిష్ఠానం దీనికి ఆమోద ముద్ర వేసి అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తుంది. వచ్చే నెల 15 నాటికి 75 స్థానాల వరకూ అభ్యర్థులను ప్రకటిస్తారని తెలిసింది. సెప్టెంబర్ చివరి కల్లా మొత్తం సీట్లకు అభ్యర్థులను ప్రకటిస్తారని సమాచారం.
This post was last modified on August 29, 2023 3:13 pm
https://youtu.be/g3JUbgOHgdw?si=jpCbsxB5cP_qeRwA ఇతర రాష్ట్రాల్లో ప్రభాస్ కాకుండా ఒక తెలుగు హీరోకి ఇంత క్రేజ్ ఏమిటాని అందరూ ఆశ్చర్యపోయే రీతిలో పుష్ప…
తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నటి కస్తూరి అరెస్ట్ తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇటీవల చెన్నై…
‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఎంత డీగ్లామరస్గా కనిపిస్తాడో తెలిసిందే. ఒక ఎర్రచందనం కూలీ పాత్ర కావడంతో అందుకు తగ్గట్లు…
కోలీవుడ్లో చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకున్న దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్కు సంబంధం లేకుండా.. అంచనాలు…
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…