వివిధ పరిణామాల కారణంగా తెలంగాణాలో బీఆర్ఎస్ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతోంది. ముఖ్యంగా అసెంబ్లీ అభ్యర్ధుల ప్రకటన తర్వాత మరింత స్పీడుగా పడిపోతోంది. రెండు వారాల్లోనే 3 శాతం మద్దతు పడిపోయింది. అన్నీపార్టీలకన్నా ముందుగా అభ్యర్ధులను ప్రకటించాలని కేసీయార్ అనుకున్నారు. దీనివల్ల చాలా లాభాలున్నాయనే అలా డిసైడ్ అయ్యారు. అనుకున్నట్లుగానే 119 నియోజకవర్గాల్లో 115 మంది అభ్యర్ధులను ప్రకటించేశారు. అయితే అలా ప్రకటించటమే ముందుముదు చాలా మైనస్ అయ్యేట్లుగా ఉందని ఇపుడు అనిపిస్తోంది.
ఎలాగంటే కేసీయార్ ప్రకటించి అభ్యర్ధుల్లో చాలామంది మీద జనాల్లో కాదు కదా ముందు పార్టీలోనే తీవ్రమైన వ్యతిరేకత కనబడుతోంది. అభ్యర్ధులకు, ఆశావహులకు ఏమాత్రం పొత్తు కుదరటంలేదు. ఇంతముందుగా అభ్యర్ధులను ప్రకటించటంలో కేసీయార్ లక్ష్యాలు రెండున్నాయి. మొదటిదేమో పార్టీలో అసంతృప్తులను మెల్లిగా దగ్గరకు చేర్చుకోవటం. రెండోది ప్రచారం చేసుకోవటానికి కావాల్సినంత సమయం ఉండటం. రెండో లక్ష్యం మాటేమిటో కానీ మొదటిది మాత్రం పూర్తిగా వికటిస్తోందనే అనిపిస్తోంది.
తెలంగాణా ఇంటెన్షన్స్ అనే సంస్ధ నిర్వహించిన సర్వేలో 51 శాతం మంది కేసీయార్ పాలనపై తీవ్రమైన వ్యతిరేకత చూపారట. అలాగే అంతకుమించి అభ్యర్ధులపై వ్యతిరేకంగా మండిపడుతున్నారట. పాజిటివ్ గా ఉన్నది కేవలం 38 శాతం జనాలే అని తేలింది. రు. 99,999 లోపున్న వ్యవసాయ రుణాలను మాఫీ చేసినా రైతుల్లో సానుకూలత కనిపించటంలేదు. ఎందుకంటే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికిప్పుడు కేసీయార్ హడావుడిగా రుణమాఫీ చేశారు.
నిజానికి ఇపుడు చేసిన మాఫీ ఎప్పుడో అవ్వాల్సింది. ఇన్ని సంవత్సరాలు రుణమాఫీ కాకపోవటంతో బ్యాంకులు రైతులను పీల్చి పిప్చిచేసేశాయి. అలాగే లక్షరూపాయల పైన ఉన్న రుణాలను మాఫీచేయలేదు. లక్ష రూపాయలకు పైగా రుణాలున్న రైతులు సుమారు 20 లక్షలమందున్నారు. మరి వీళ్ళ రుణాల మాఫీ ఎప్పుడో తెలీదు. బీజేపీకి సైతం 3.5 శాతం ఆదరణ తగ్గిపోయిందని తేలింది. కాంగ్రెస్ కు మాత్రం స్వలంగా అంటే సుమారు 2 శాతం ఆదరణ పెరిగింది. మరి ముందుముందు బీఆర్ఎస్ పరిస్ధితి ఏమిటో మరింత స్పష్టం కాబోతోంది సర్వేల్లో.
This post was last modified on August 29, 2023 2:52 pm
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…