కడప జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. రిమాండ్ లో ఉన్న ప్రభాకర్ రెడ్డి జలుబు, దగ్గుతో బాధపడుతుండడంతో అనుమానం వచ్చి కరోనా టెస్టు చేయించగా పాజిటివ్ అని తేలింది. దీంతో, ఆయనను జైలు సిబ్బంది ప్రత్యేకమైన సెల్ కు తరలించి ఐసోలేట్ చేసి చికిత్స అందిస్తున్నారు. ప్రభాకర్ రెడ్డికి కరోనా సోకడంతో జైలు సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డికి అనంతపురం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డికి ఆరోగ్య రీత్యా బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో, జేసీ ప్రభాకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.
వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి అరెస్టైన సంగతి తెలిసిందే. 55 రోజుల పాటు కడప జైల్లో ఉన్న వీరిద్దరు…ఆ కేసులో బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే, బెయిల్ పై విడుదలై బయటకు వెళుతున్న సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని, విధుల్లో ఉన్న సీఐను దూషించారని ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు సహా పలు కేసులు నమోదయ్యాయి. దీంతో, బెయిల్‌పై విడుదలైన తర్వాతి రోజే ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేసి మళ్లీ కడప జైలుకు తరలించారు. ఈ క్రమంలోనే కడప జైలులో రిమాండ్ లో ఉన్న ప్రభాకర్ రెడ్డి కరోనా సోకింది. దీంతో, ప్రభాకర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించుకున్నారు. ఆ పిటిషన్ ను పరిశీలించిన న్యాయస్థానం జేసీ ప్రభాకర్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
This post was last modified on August 19, 2020 7:37 pm
గత నెల సంక్రాంతికి విడుదలైన గేమ్ ఛేంజర్ మొదటి రోజే హెచ్డి పైరసీకి గురి కావడం ఇండస్ట్రీ వర్గాలతో పాటు…
తమిళంలో బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు అజిత్ కుమార్. సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు తగ్గాక.. అటు విజయ్, ఇటు అజిత్…
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ…
ఇండియా - పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఆ వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2025 ఛాంపియన్స్…
పూజా హెగ్డే ముంబయి అమ్మాయే అయినా.. ఆమెకు బ్రేక్ వచ్చింది.. ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే అన్న సంగతి తెలిసిందే.…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ…