ఆసిఫాబాద్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు వచ్చే ఎన్నికల్లో ఆ స్థానాన్ని వదులుకోనున్నారా? లోక్ సభకు పోటిచేసేలా ఆయన్ని కేసీఆర్ ఒప్పించారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో గెలుపుపై కన్నేసిన కేసీఆర్.. అందుకు తగ్గ కసరత్తుల్లో నిమగ్నమయ్యారు. గెలుపు గుర్రాలపై ఫోకస్ పెట్టిన ఆయన కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చే అవకాశాలున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే ఆసిఫాబాద్ ఎమ్మెల్యేను మార్చేందుకు కేసీఆర్ సిద్ధమైనట్లు సమాచారం.
2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఆత్రం సక్కు విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కోవ లక్మ్షీ చేతిలో ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో కోవ లక్మ్షీపై గెలిచిన తర్వాత కాంగ్రెస్ వదిలి బీఆర్ఎస్లో చేరిపోయారు. ఈ ఏడాది ఎన్నికల్లో మరోసారి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కానీ తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్ బీఆర్ఎస్ నాయకులను ప్రగతిభవన్కు పిలిపించుకుని కేసీఆర్ మాట్లాడారు.
వచ్చే ఎన్నికల్లో ఆత్రం సక్కుకు బదులు ప్రస్తుతం కుమురం భీం జడ్పీ ఛైర్ పర్సన్గా ఉన్న కోవ లక్మ్షీని పోటీ చేయించాలని కేసీఆర్ చూస్తున్నారని తెలిసింది. ఇదే విషయాన్ని ఆత్రం సక్కుకు కేసీఆర్ చెప్పారని సమాచారం. అయితే మొదట సుముఖత వ్యక్తం చేయని సక్కు.. లోక్ సభ సీటు ఇచ్చి గెలిపించుకుంటానని కేసీఆర్ హామీ ఇవ్వడంతో సరేనన్నారని తెలిసింది.
This post was last modified on August 20, 2023 8:13 am
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…