సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తిరిగి బీఆర్ఎస్ గూటికే చేరబోతున్నారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఇప్పటికే జగ్గారెడ్డిని బీఆర్ఎస్లో చేర్చుకునే దిశగా చర్చలు పూర్తయ్యాయని చెబుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి ఆయన బీఆర్ఎస్ తరపున పోటీ చేయడం దాదాపుగా ఖాయమైందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డిని బీఆర్ఎస్లో చేర్చుకోవద్దంటూ ఆ పార్టీ నేతలు డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
సంగారెడ్డి నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో జగ్గారెడ్డిపై బీఆర్ఎస్ నేత చింతా ప్రభాకర్ రెడ్డి విజయం సాధించి తొలి సారి ఎమ్మెల్యే అయ్యారు. కానీ 2018 ఎన్నికల్లో జగ్గారెడ్డి చేతిలో ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి పోటీ చేసేందుకు చింతా ప్రభాకర్రెడ్డి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు జగ్గారెడ్డి బీఆర్ఎస్లో చేరతారనే వార్త చింతాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని చెబుతున్నారు. జగ్గారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి.. చింతాను ఎమ్మెల్సీని చేస్తానని కేసీఆర్ చెప్పారని సమాచారం.
కానీ ఎమ్మెల్సీ పదవి పై చింతా ఆసక్తితో లేరని తెలిసింది. మరోసారి ఎమ్మెల్యేగానే పోటీ చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఉన్నారని టాక్. దీంతో చింతా వర్గం నాయకులు, అనుచరులు.. జగ్గారెడ్డిని బీఆర్ఎస్లోకి చేర్చుకోవద్దని డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఓ ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించిన సంగారెడ్డి నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు జగ్గారెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దని ఏకగ్రీవ తీర్మానం కూడా చేశారు. తాజాగా 200 మంది నాయకులు కలిసి హరీష్ రావు నివాసానికి వెళ్లి జగ్గారెడ్డిని పార్టీలోకి తీసుకోవద్దని కోరారని తెలిసింది. మరి చింతాకు చింత తప్పుతుందా? లేదా జగ్గారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా నిలబడతారా? అన్నది కేసీఆర్ చేతుల్లో ఉంది.
This post was last modified on August 18, 2023 9:41 pm
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…