కలిసి వచ్చే కాలాన్ని ఎవరూ ఆపలేరంటారు. అదే సమయంలో గాలి తేడా కొట్టేదాన్ని ఆపటం సాధ్యం కాదన్న మాటకు తగ్గట్లే.. ఇటీవల కాలంలో కొన్ని పరిణామాలు అమెరికాలో చోటు చేసుకుంటున్నాయని చెప్పాలి. అమెరికా అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికలకు గడువు దగ్గరకు వచ్చేస్తోంది. అసలే కరోనా కాలం.. దానికి తోడు.. ఒక్కొక్కటిగా తోడవుతున్న అంశాలు అధ్యక్షుల వారికి ఇబ్బందికరంగా మారుతున్నట్లుగా చెబుతున్నారు.
అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల అభ్యర్థిగా బరిలో ఉన్న బైడెన్ తనకు ఏమాత్రం పోటీ కాదనుకున్న ట్రంప్ కు కాలం కలిసి రావటం లేదు. ఆయనకు జతగా ఉపాధ్యక్ష పదవికి కమలా హారీస్ రంగంలోకి దిగటం మరింత కలిసి వస్తోంది. తనకు వ్యతిరేకంగా పరిణామాలు చోటు చేసుకుంటే చాలు.. నోటికి పని చెప్పే అలవాటు ట్రంప్ కు ఎక్కువే. దీనికి తగ్గట్లే ఈ మధ్య కాలంలో ఎంతలా నోరు పారేసుకుంటున్నారో చూస్తున్నదే. కరోనా వేళ.. ట్రంప్ సర్కారు తీరుతో గుర్రుగా ఉన్న అమెరికన్లు.. అధికార మార్పు కోరుకుంటున్నట్లుగా ఇప్పటికే పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.
ఇలాంటివేళ.. అనూహ్యంగా మరో ప్రతికూల పరిస్థితి ట్రంప్ నకు ఎదురైందనిచెప్పాలి. 2016లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం వెనుక రష్యా ఉందన్న మాట పెద్ద ఎత్తున ప్రచారం సాగటం తెలిసిందే. అమెరికా ఫలితాల్ని రష్యా ప్రభావితం చేసిందన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. ఈ అంశంపై విచారణకు ఆదేశించారు. ఇప్పటివరకు బయటకు రాని నివేదిక.. తాజాగా మాత్రం రష్యా పాత్రను తేలుస్తూ అమెరికా సెనెట్ కమిటీ స్పష్టం చేయటం ట్రంప్ కు ఇబ్బందికరమంటున్నారు.
అమెరికాలో పాలనను మరోదేశం ప్రభావితం చేయటాన్ని అమెరికన్లు ససేమిరా అంటారు. అందులోకి ట్రంప్ కు మద్దుతుగా రష్యా నిలిచిందన్నది ఆగ్ర రాజ్య ప్రజలు జీర్ణించుకోలేరు. సరిగ్గా ఎన్నికల సమయానికి కాస్త ముందుగా అమెరికా సెనెట్ ఇంటెలిజెన్స కమిటీ అభిప్రాయం ప్రకారం 2016 ఎన్నికల్లో ట్రంప్ కు అనుకూలంగా పని చేయటానికి రష్యా తీవ్ర ప్రయత్నాలు చేసిన మాట నిజమేనని తేల్చింది. అయితే.. ట్రంప్ మీద ఎలాంటి అభియోగాలు మోపలేదు. ఇది కాస్త ఊరటను ఇచ్చినా.. తాజా రిపోర్టు ఆయనకు ప్రతికూలంగా మారటం ఖాయమంటున్నారు.
ఎందుకంటే.. నాటి ఎన్నికల సమయంలో రష్యా ఇంటెలిజెన్సు సర్వీసెస్ కు చెందిన వ్యక్తులతో ట్రంప్ ప్రచార వ్యూహకర్తలు పలుమార్లు సమావేశం కావటం తెలిసిందే. ఇలా చేయటాన్ని అమెరికన్లు అస్సలు ఒప్పుకోరు. ఆ విధంగా చూసినా.. తాజాగా కమిటీ నివేదిక ట్రంప్ కు చేటు చేస్తుందని చెప్పక తప్పదు. చూస్తుంటే.. ట్రంప్ కు ప్రతికూలంగా ఒక్కో పరిణామం పద్దతి ప్రకారం జరిగిపోతున్నట్లు అనిపించట్లేదు?
This post was last modified on August 19, 2020 1:08 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…