టాలీవుడ్ హీరోయిన్ రేణూదేశాయ్ కొద్ది రోజుల క్రితం పవన్ డబ్బు మనిషి కాదు అని..ప్రజలకు మంచి చేయడానికే వచ్చాడు తప్ప..డబ్బులు కోసం కాదు అని చెబుతూ ట్విటర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ చూసిన తరువాత పవన్ అభిమానులు ఎంతో సంతోషంగా ఉంటే కొంత మంది మాత్రం ఆమె పై ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు.
ఈ క్రమంలోనే ఓ వ్యక్తి నిన్ను ఇందుకు కాదు పవన్ తన్ని తరిమేసింది అంటూ కామెంట్ చేశాడు. దాని గురించి స్పందించిన రేణు ఆ నెటిజన్ కామెంట్ కి గట్టిగా సమాధానం చెప్పింది. ” నా విడాకుల విషయంలో నా మాజీ భర్త ఎలా మోసం చేశాడో చెప్పినప్పుడు ఆయన అభిమానులు నన్ను తిట్టారు.
ఇప్పుడు దేశ పౌరురాలిగా నేను అతనికి అనుకూలంగా కొన్ని మాటలు మాట్లాడితే దారుణంగా నాపై కామెంట్‌లు చేస్తున్నారు. విడాకుల విషయంలో నా మాజీ భర్త గురించి అప్పట్లో నేను మాట్లాడింది నిజం. ఆరోజు నేను అలా మాట్లాడినందుకు నేను కొందరి నుంచి డబ్బులు తీసుకున్నానని పవన్ అభిమానులు ఆరోపణలు చేశారు.
అంతే కాకుండా సోషల్ మీడియా వేదికగా నన్ను దారుణంగా దూషించారు కూడా. ఇప్పుడు కూడా నా విషయంలో అదే జరుగుతోంది. నా మాజీ భర్తకు అనుకూలంగా ఉండే కొందరు వ్యక్తులు నాకు డబ్బులు ఇచ్చారని అభిమానులు ఆరోపిస్తున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు. నా మాజీ భర్త గురించి నేను అప్పుడు, ఇప్పుడూ నిజమే చెప్పాను.
అతనితో ప్రేమలో పడి నిజాలు మాట్లాడినందుకు తగిన మూల్యాన్ని ఎప్పటి నుంచో చెల్లించుకుంటున్నాను. నాకు ఇలా కావాల్సిందే..నా విధి ఇదే. అది ఎలా ఉంటే అలాగే కానియండి..దయచేసి నాపై దుర్భాషలాడకండి` అంటూ రేణూ దేశాయ్ సోషల్ మీడియా ఇన్ స్టా వేదికగా అభిమానులకు విజ్ఞప్తి చేశారు.
పవన్ పై ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రేణూ దేశాయ్ ఓ నెటిజన్ తనని దారుణంగా అవమానిస్తూ కామెంట్ చేసిన పోస్ట్ ని షేర్ చేసింది. అందుకే నిన్ను పవన్ తన్ని తరిమేశాడు అని కామెంట్ చేశాడు. దీనికి రేణూ దేశాయ్ సరైన సమాధానం చెప్పారు. నన్ను తిట్టడంలో నీకు మనశ్శాంతి లభించిందా?..కానివ్వండి అంటూ రిప్లై ఇచ్చారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పవన్ కల్యాణ్ తో విడిపోయిన తరువాత రేణూ దేశాయ్ పిల్లలతో కలిసి వేరుగా ఉంటున్నారు. సినిమాలు, టీవీ షోలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆమె ఇటీవలే మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా రూపొందుతున్న స్టూవర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ఆధారంగా రూపొందుతున్న టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆమె కథకు కీలకమైన హేమలతా లవనం పాత్రలో నటిస్తున్నారు.
This post was last modified on August 17, 2023 10:19 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…