Political News

ఆశ లేదంటూనే గాలం వేస్తోన్న కోమ‌టిరెడ్డి!

సీఎం ప‌ద‌విపై ఆశ లేదంటూనే ఆ కుర్చీకి కాంగ్రెస్ ఎంపీ కోమ‌టి రెడ్డి వెంక‌ట్‌రెడ్డి గాలం వేస్తున్న‌ట్లే క‌నిపిస్తోంది. తాజాగా ఈ ఎంపీ చేసిన వ్యాఖ్య‌లే అందుకు నిద‌ర్శ‌న‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. సీఎం కుర్చీపై, మంత్రి ప‌ద‌విపై ఆశ లేద‌ని తాజాగా వెంక‌ట్‌రెడ్డి పేర్కొన్నారు. కానీ ఈ వ్యాఖ్య‌ల వెనుక పెద్ద ప్లానే ఉంద‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈ సారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేయాల‌నే ఆలోచ‌న‌లో కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి ఉన్న‌ట్లు తెలుస్తోంది. గ‌త కొంత‌కాలంగా ఆయ‌న వ్య‌వ‌హార శైలి, మాట‌లు అందుకు అనుగుణంగానే సాగుతున్నాయి. ఇక యాదాద్రి జిల్లా కాంగ్రెస్ అధ్య‌క్షుడు, భువ‌న‌గిరి నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జీగా ఉండే అనిల్ కుమార్ కాంగ్రెస్‌ను వీడి కారెక్కిన సంగతి తెలిసిందే. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో భువ‌న‌గిరి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కోమ‌టిరెడ్డి ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటున్న‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు కాంగ్రెస్ అధిష్ఠానం ద‌గ్గ‌ర కూడా త‌న మ‌నసులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టిన‌ట్లు తెలిసింది.

సీఎం ప‌ద‌విని ఆశించే కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలో దిగుతున్నార‌నే అభిప్రాయం రాకుండా ఉండేందుకు ముందే ఆయ‌న జాగ్ర‌త్త ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. అందుకే సీఎం కుర్చీపై ఆశ లేద‌న్నారు. అంతే కాకుండా మంత్రి ప‌ద‌వీ వ‌ద్దంటున్నారు. కానీ రేప్పొద్దున ఎన్నిక‌ల్లో టికెట్ వ‌చ్చి.. ఎమ్మెల్యేగా గెలిస్తే అప్పుడు మాత్రం సీఎం ప‌ద‌వి కావాల‌నే వాళ్ల‌లో కోమ‌టిరెడ్డి ముందుంటార‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. టికెట్ వ‌చ్చేంత‌వ‌ర‌కే ఆయ‌న ఈ విధంగా మాట్లాడతార‌ని చెబుతున్నారు. మ‌రి కాంగ్రెస్ ఆయ‌న్ని ఈ సారి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బ‌రిలో దింపుతుందో లేదో చూడాలి.

This post was last modified on August 17, 2023 1:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బైడెన్ వ‌ర్సెస్ ట్రంప్‌.. న‌లిగిపోతున్న విదేశీయులు!

అగ్ర‌రాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న ప‌రిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణుల‌ను ఇర‌కాటంలోకి నెడుతున్నాయి. మ‌రో రెండు మూడు వారాల్లోనే…

3 hours ago

ఆ ఖైదీ జైలు శిక్ష‌ ఫిఫ్టీ-ఫిఫ్టీ.. భార‌త్‌, బ్రిట‌న్ ఒప్పందం!

జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చ‌ర్యం అంద‌రికీ క‌లుగుతుంది. కానీ, ఇది వాస్త‌వం. దీనికి సంబంధించి…

4 hours ago

‘టీడీపీ త‌లుపులు తెరిస్తే.. వైసీపీ ఖాళీ’

ఏపీలో రాజ‌కీయ వ్యూహాలు, ప్ర‌తివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయ‌కులు చేస్తున్న వ్యాఖ్య‌లు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్ప‌టికే…

5 hours ago

18 ఏళ్ల త‌ర్వాత‌ ప‌రిటాల ర‌వి హ‌త్య కేసులో బెయిల్

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి ప‌రిటాల ర‌వి గురించి యావ‌త్ ఉమ్మ‌డి రాష్ట్రానికి తెలిసిందే. అన్న‌గారు ఎన్టీఆర్ పిలుపుతో…

6 hours ago

మహేష్ ఫ్యాన్స్ ఓన్ చేసుకున్నారు.. జర భద్రం!

క్రిస్మస్‌కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…

7 hours ago