సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. విశాఖలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్..తాజాగా నేడు భీమిలిలోని ఎర్రమట్టి దిబ్బలను పరిశీలించారు. ఎర్ర మట్టి దిబ్బలను ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పవన్ ఈ ప్రాంతంలో పర్యటించారు. ఈ క్రమంలోనే జగన్ పై పవన్ మండిపడ్డారు. ఎర్రమట్టి దిబ్బలు విశాఖ వారసత్వ సంపద. అని, వాటిని కాపాడుకోవడం మన బాధ్యత అని అన్నారు. ఈ వ్యవహారంపై జగన్ ప్రభుత్వం 48 గంటల్లో స్పందించకుంటే ఎన్జీటీకి వెళ్తామని పవన్ అల్టిమేటం జారీ చేశారు.
ఎర్రమట్టి దిబ్బలు అరుదైన వారసత్వ సంపద అని, శ్రీలంకతోపాటు మన విశాఖలో ఉన్నాయని పవన్ చెప్పారు. 1200 ఎకరాల్లో ఉండే ఎర్రమట్టి దిబ్బలు 292 ఎకరాలే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ సంపదను కాపాడుకోవడం మన బాధ్యత అని, ఎర్రమట్టి దిబ్బలున్న ప్రాంతాల్లో బఫర్ జోన్ ఏర్పాటు చేయాలని పవన్ డిమాండ్ చేశారు. వేల సంవత్సరాలుగా ఎర్రమట్టిదిబ్బలు సహజసిద్ధంగా ఏర్పాడ్డాయని, వైసీపీ నేతలకు చిన్నపాటి కనికరం కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి ఎర్రమట్టిదిబ్బల్లో నిర్మాణాలు చేపట్టారని మండిపడ్డారు.
ఉత్తరాంధ్రాలో వైసీపీ నేతల దోపిడీని ఆపాలని, ఎర్రమట్టి దిబ్బలపై పర్యావరణ ప్రేమికులు దృష్టిపెట్టాలని పవన్ కోరారు. ఎర్రమట్టి దిబ్బల సమీపంలో మట్టి తవ్వాల్సిన అవసరం వీఎంఆర్డీఏకు ఏంటని నిలదీశారు. కలెక్టర్ దీనిపై దృష్టి సారించాలని కోరారు. 1200 ఎకరాలను నేవీకి ఇస్తే 292 ఎకరాలు మిగిలిందని, వైసీపీ హయాంలో అవి కూడా అన్యాక్రాంతం అవుతున్నాయని మండిపడ్డారు.
వాలంటీర్లే వైసీపీకి ప్రైవేటు సైన్యం అని, సాక్షి పేపర్ కోసం ప్రతి ఏడాది 48 కోట్ల రూపాయలు ప్రజాధనం లూటీ చేస్తున్నారని ఆరోపించారు. అర్హత లేని వాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలుతున్నాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తమదే అనే భ్రమలో జగ్గు భాయ్ అండ్ గ్యాంగ్ ఉన్నారని పవన్ దుయ్యబట్టారు.
This post was last modified on August 16, 2023 9:58 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…