కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకన్న దర్శనానికి వెళ్లే భక్తులకు చిరుత, ఎలుగుబంటి వంటి వన్యప్రాణుల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల చిన్నారులపై చిరుత దాడి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. ఈ క్రమంలోనే భద్రతా చర్యల పేరుతో టీటీడీ కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గం ద్వారా ఆలయానికి వెళ్లే ప్రతి భక్తుడికి ఒక ఊతకర్ర ఇస్తామంటూ టీటీడీ నూతన చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ప్రకటనపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది.
సైలెంట్ గా కర్రను ఇచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమోగానీ మానవజాతి పరిణామ క్రమంలో కర్రకు ఎంతో ప్రాధాన్యత ఉందంటూ కేజీఎఫ్ రేంజ్ లో బిల్డప్ ఇవ్వడంతో కరుణాకర్ రెడ్డిపై సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంపై టిడిపి నేత బోండా ఉమ స్పందించారు. వైసీపీలో ‘పుష్ప’లు ఎక్కువయ్యారని, అడవుల్లో ఎర్ర చందనం కోసం చెట్లు నరికేయడం వల్లే నడకమార్గంలోకి పులులు వస్తున్నాయని సంచలన ఆరోపణ చేశారు.
అధికార పార్టీ అండతో యదేచ్చగా ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్నారని, అందుకే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు. చిరుతను తరిమేందుకు బ్రహ్మాండమైన ఊతకర్ర ఇస్తామని చెబుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు. ఆ కర్రలతో ప్రభుత్వానికి భక్తులు బడిత పూజ చేయాలని బోండా ఉమా పిలుపునిచ్చారు.చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ పై ప్రజెంటేషన్ ఇస్తే వైసిపి ప్రిజన్ డాక్యుమెంట్ పై ప్రజెంటేషన్ ఇచ్చిందని ఎద్దేవా చేశారు. అమరావతిలో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం అని అవినీతి ఆరోపణలు చేయడం తప్ప ఒకటైన నిరూపించారా అని నిలదీశారు.
ఎన్ని ఎంక్వయిరీలు వేసినా చంద్రబాబు కాలి గోటిని కూడా టచ్ చేయలేకపోయారని అన్నారు. చంద్రబాబు తప్పు చేస్తే నాలుగున్నరేళ్లు జగన్ ఊరుకునేవాడా అని ప్రశ్నించారు. చంద్రబాబు 420 అయితే వైసిపి వాళ్ళు 840 అని నిప్పులు చెరిగారు. జగన్ పని అయిపోయిందని అందుకే అబద్ధాలు చెప్పి మళ్ళీ అధికారం చేపట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఒంటిమీద మంచి బట్టలు ఉన్నా పథకాల్లో కోత వేశారని, 10 మందికి ఇచ్చి 90 మందికి ఎగ్గొట్టారని విమర్శించారు. తాగుబోతుల జేబులు కొట్టేసి 10 లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.
This post was last modified on August 16, 2023 7:08 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ జన్మదినం సందర్భంగా గురువారం చాలా ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు…
రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత.. పనిచేసుకుని పోవడం తెలిసిందే. అయితే.. చంద్రబాబు హయాంలో మాత్రం ఏదో గుడ్డిగా పనిచేసుకుని పోతున్నామంటే…
నందమూరి బాలకృష్ణ హిట్ మూవీ ‘భగవంత్ కేసరి’ని తమిళ టాప్ స్టార్ విజయ్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్…
ప్రస్తుతం స్విట్జర్లాండ్ లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ పెట్టుబడుల సదస్సులో సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్…
పుష్ప-2 విడుదలకు ముందు ఈ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ విషయమై ఎంత గొడవ నడిచిందో తెలిసిందే. సుకుమార్ కెరీర్ ఆరంభం…
డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ తో వరుసగా రెండు బ్లాక్ బస్టర్స్ సాధించిన సిద్దు జొన్నలగడ్డ కొంచెం గ్యాప్ తీసుకున్నట్టు…