Political News

`మెగా స‌పోర్టు` అవ‌స‌రం లేదా.. జ‌న‌సేనానీ?

ఔను.. ఇప్పుడు ఈ మాటే రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. రాష్ట్రంలో రెండు రోజుల కిందట చోటు చేసుకున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నించిన వారు.. ఇదే మాట అంటున్నారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి ముఖ్య‌మంత్రి పీఠం ఎక్కుతాన‌ని కొంత సేపు చెబుతున్నారు. త‌ర్వాత‌.. తాను ఎమ్మెల్యే అయితే.. చాల‌నే భావ‌న‌లో మాట్లాడుతున్నారు. స‌రే.. ఏదేమైనా.. 2019 ఎన్నిక‌ల‌ను తీసుకుంటే.. ఆయ‌న ఎంత దూకుడుగా ఉన్నా.. ఫ‌లితం క‌నిపించ‌లేదు.

వ‌చ్చే ఎన్నికల్లో క‌నిపిస్తుంద‌నే ఆశ జ‌న‌సేన‌లో ఆశ‌లు ఉండొచ్చు. కానీ.. రాజ‌కీయాల్లో ఉన్న‌వారికి అంది వ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశం కూడా.. స్వ‌ర్ణ‌మ‌య‌మే. పైగా ఎన్నిక‌ల స‌మ‌యం కావ‌డంతో ఎవ‌రు ఎటు నుంచి త‌మ‌కు అందివ‌చ్చినా వినియోగించుకోవాల‌నే రాజ‌కీయాల్లో ఉన్న‌వారు చేసే ప‌నే. అయితే.. జ‌నసేన విష‌యాన్ని తీసుకుంటే.. ఈ త‌ర‌హా ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ద‌న్నుగా మెగా స్టార్ చిరంజీవి .. వాల్తేరు వీర‌య్య‌ఫంక్ష‌న్‌లో మాట్లాడారు. పైకి ఆయ‌న జ‌న‌సేన పేరు.. పార్టీ గురించి ప్ర‌స్తావించ‌క‌పోయినా.. ఏపీ స‌ర్కారును ఇరుకున ప‌డేలా వ్యాఖ్య‌లు చేశారు. ఆ వెంట‌నే వైసీపీ నాయ‌కులు, మంత్రులు చిరును టార్గెట్ చేశారు. అంతేకాదు.. ఇదేస‌మ‌యంలో చిరంజీవి తాజా సినిమా బోళా శంక‌ర్ సినిమాకు సంబంధించిన టికెట్ల ధ‌ర‌లు, అద‌న‌పు షోల విష‌యంలో ఏపీ స‌ర్కారు మ‌డ‌త పేచీ పెట్టింది.

ఈ రెండు విష‌యాల‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు జ‌న‌సేన అధినేత ఎక్క‌డా ప్ర‌య‌త్నం చేయ‌లేద‌నే టాక్ వినిపిస్తోంది. చిరంజీవినివైసీపీ నాయ‌కులు, మంత్రులు ఏకేసినా.. ప‌న్నెత్తు మాట ఆయ‌న అన‌లేదు. విశాఖ‌లో వారాహి యాత్ర 3.0 చేసినా.. ఆయ‌న ఎక్క‌డా చిరంజీవి చేసిన వ్యాఖ్య‌ల‌ను ప్ర‌స్తావించ‌లేదు. పోనీ.. మంత్రులు చిరుపై చేసిన వ్యాఖ్య‌ల‌ను కూడా ఆయ‌న తిప్పికొట్టేలేదు. ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. బోళా శంక‌ర్ విష‌యంలో స‌ర్కారు వ్య‌వ‌హ‌రించిన తీరును కూడా ఆయ‌న ప్ర‌స్తావించ‌లేదు.

అంటే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు మెగా సెంటిమెంటు, మెగా స‌పోర్టు అవ‌స‌రం లేదా? అనేది చ‌ర్చ‌కు దారితీస్తోంది. ఎన్నిక‌ల స‌మ‌యంలో అత్యంత కీల‌క‌మైన ఈ స‌పోర్టును ఆయ‌న అందిపుచ్చుకుంటే.. ఎంతో కొంత మేలు జ‌రుగుతుంద‌ని జ‌న‌సేన అభిమానులు భావిస్తున్నా.. ప‌వ‌న్ మాత్రం ఆ జోలికి పోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on August 12, 2023 7:24 pm

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

9 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

11 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

11 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

12 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

14 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

15 hours ago