Political News

బయటపడిన మోడీ డొల్లతనం

ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో నరేంద్రమోడీ డొల్లతనం బయటపడింది. మణిపూర్ అల్లర్ల నేపధ్యంలో నిరసనగా ఇండియా కూటమి, ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. దాని ప్రకారమే 8,9,10 తేదీల్లో పార్లమెంటులో చర్చలు కూడా జరిగాయి. మూడురోజులు మణిపూర్ అల్లర్ల విషయంలో రాష్ట్ర, కేంద్రప్రభుత్వాలు ఏ విధంగా విఫలమయ్యాయో ప్రతిపక్షాలు తీవ్రంగా ఎండగట్టాయి. మణిపూర్లో జరిగిన అల్లర్లను దేశం మొత్తానికి తెలియజేయటానికే ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని మార్గంగా ఎంచుకున్నాయి.

ప్రతిపక్షాలన్నీ మాట్లాడేసిన తర్వాత ఫైనల్ గా మోడీ జవాబిచ్చారు. మామూలుగా అయితే ప్రతిపక్షాల ఆరోపణలు, విమర్శలకు సమాధానం ఉంటుంది. అలాగే మణిపూర్లో జరిగిందేమిటి ? కేంద్రం తీసుకున్న చర్యలు తదితరాలను సమాధానం రూపంలో చెప్పాలి. కానీ మోడీ చేసిందేమంటే ఇండియా కూటమిని టార్గెట్ చేస్తు మాట్లాడారు. దాదాపు మూడుగంటలపాటు మోడీ మాట్లాడితే అందులో సుమారు 2.3 గంటల పాటు ప్రతిపక్షాలపై ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోయారు.

ఇక్కడ విషయం ప్రతిపక్షాలపై ఆరోపణలు, విమర్శలు చేయటం కాదు. మణిపూర్లో అల్లర్లను కంట్రోల్ చేయటానికి కేంద్రప్రభుత్వం తీసుకున్న చర్యలు, భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఏమి చర్యలు తీసుకోబోతున్నారు లేదా తీసుకున్నారు అన్న విషయాన్ని చెప్పాలి. కానీ మోడీ అది చెప్పకుండా రాజకీయ ఉపన్యాసమిచ్చారు. కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి, ప్రతిపక్షాల వల్ల దేశానికి ఏ విధంగా నష్టం జరుగుతోందో వివరించారు. దేశానికి కాంగ్రెస్ వల్ల జరిగిన నష్టాన్ని ప్రస్తావించారు.

ప్రతిపక్షాలు మాట్లాడింది ఒకటి, అడిగిన ప్రశ్న మణిపూర్ కు సంబంధించి అయితే మోడీ మాట్లాడింది వేరు, చెప్పిన సమాధానం వేరు. మణిపూర్లో అల్లర్లకు సంబంధించి మోడీ మాట్లాడింది చాలా తక్కువ. ఇక్కడే మోడీలోని డొల్లతనం బయడపడిపోయింది. కేవలం సంఖ్యాబలం కారణంగా మాత్రమే అవిశ్వాస తీర్మానంలో మోడీ ప్రభుత్వం గెలిచింది. అంతే కానీ మణిపూర్ జనాల్లో ప్రభుత్వం పట్ల నమ్మకాన్ని అయితే పెంచలేకపోయింది. మణిపూర్లో జరిగింది నిజంగా సిగ్గుపడాల్సిన విషయమే అని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా అంగీకెరించటంతోనే ప్రతిపక్షాలకు విజయం దక్కిందని అర్ధమైపోయింది. 

This post was last modified on August 11, 2023 1:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెళ్లి ఆగిపోతే ఎవరైనా డిప్రెషన్ లోకి వెళ్తారు.. కానీ మందాన మాత్రం..

సాధారణంగా ప్రేమ విఫలమైతేనో, పెళ్లి ఆగిపోతేనో ఎవరైనా కొన్నాళ్లు డిప్రెషన్‌లోకి వెళ్తారు. ఆ బాధ నుంచి బయటపడటానికి నెలల సమయం…

55 minutes ago

‘వైసీపీ తలా తోకా లేని పార్టీ’

తమ ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచి పనుల గురించి వివరించడంలో చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారు. ఏపీ పునర్నిర్మాణానికి తమ ప్రభుత్వం…

1 hour ago

మహేష్ బాబును మరిచిపోతే ఎలా?

టాలీవుడ్లో అత్యంత పొడవైన హీరోల లిస్టు తీస్తే.. అందులో రెబల్ స్టార్ ప్రభాస్ పేరే ముందు చెప్పుకోవాలన్నది వాస్తవం. టాలీవుడ్…

2 hours ago

చైనాలోని ఆ రాష్ట్రమే తెలంగాణ అభివృద్ధికి స్పూర్తి

తెలంగాణ రాష్ట్రాన్ని వ‌చ్చే 2047 నాటికి 3(30 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు) ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా రూపొందించ‌డ‌మే ల‌క్ష్యంగా…

2 hours ago

ఇలాంటి సమయంలో పార్లమెంటుకు రాకపోతే ఎలా రాహుల్ జీ

కాంగ్రెస్ అగ్ర‌నేతే కాదు.. లోక్‌స‌భలో విప‌క్ష నాయ‌కుడు కూడా అయిన రాహుల్‌గాంధీ.. త‌ర‌చుగా త‌ప్పులు చేస్తూనే ఉన్నారు. అయితే.. ఎప్ప‌టిక‌ప్పుడు…

3 hours ago

ఇడియట్స్ జోలికి ఇప్పుడెందుకు వెళ్లడం

2009లో విడుదలైన బాలీవుడ్ మూవీ 3 ఇడియట్స్ ఒక సంచలనం. అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోని కాలేజీ స్టూడెంట్…

4 hours ago