Political News

వ‌స్తారా.. అరుణాచ‌ల్ చూపిస్తా: స‌టైర్లు కుమ్మేశారుగా!

కాంగ్రెస్ అగ్ర‌నేత‌, ఇటీవ‌ల త‌న‌పై ఉన్న రెండేళ్ల జైలు శిక్ష నుంచి ఒకింత ఊర‌ట పొందిన రాహుల్‌గాంధీపై బీజేపీ నాయ‌కులు స‌టైర్లు కుమ్మేశారు. “రండి అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ చూపిస్తా” అని కేంద్ర మంత్రి కిర‌ణ్ రిజుజు స‌హా.. ప‌లువురు బీజేపీ నేత‌లు.. ఆయ‌న‌ను లోక్‌స‌భ‌లోనే ఆట ప‌ట్టించారు. దీనిపై మాట్లాడేందుకు ఏమీ క‌నిపించ‌క‌పోవ‌డంతో రాహుల్ గాంధీ మౌనంగా చూస్తుండి పోయారు. దీంతో మ‌రింత‌గా బీజేపీ ఎంపీలు, మంత్రులు స‌టైర్ల‌తో విరుచుకుప‌డ్డారు.

ఏం జ‌రిగింది?
లోక్‌స‌భ‌లో కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ  జోరుగా సాగింది. పలు అంశాలపై విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయగా, అధికార పార్టీ ఎంపీలు నరేంద్ర మోబా ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో సాధించిన అభివృద్ధి పనులను పూస‌గుచ్చిన‌ట్టు చెప్పుకొచ్చారు. అదేస‌మ‌యంలో విప‌క్ష పాలిత రాష్ట్రాల్లోని ప‌రిస్థితులు, దాడులు, అత్యాచారాలు, అక్ర‌మాలు వంటి వాటిని ప్ర‌స్తావించి విప‌క్ష నేత‌ల‌ను ఇరుకున పెట్టే ప్ర‌య‌త్నం చేశారు.

ఈ నేప‌థ్యంలోనే భార‌త్ స‌రిహ‌ద్దు వెంబ‌డి చైనా ఆక్రమణలపై కాంగ్రెస్ ఎంపీలు పదేపదే విరుచుకుప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. రాహుల్ వైపు చూసి.. “అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా ఆక్రమిత ప్రాంతాలు నిజానికి మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అప్పగించనవే. అసలు సత్యం ఎరుకపరచేందుకు పార్లమెంటు సమావేశాలు పూర్తికాగానే అరుణాచల్ తీసుకువెళ్తా. స్వ‌యంగా ఖ‌ర్చు నేనేపెట్టుకుంటా. వ‌స్తారా” అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

అంతేకాదు.. గ‌త చ‌రిత్ర‌ను కూడా ఈ సంద‌ర్భంగా రిజుజు ప్ర‌స్తావించారు. ‘1962లో లద్దాఖ్, అరుణాచల్‌పై చైనా దాడి చేసింది. మన భూభాగాన్ని కాపాడాలంటూ అప్పుడు వాజ్‌పేయి మాట్లాడారు. అప్పటికి నేను పుట్టలేదు. అయినా చరిత్ర, రికార్డులు ఆ విషయాన్ని తెలియజేస్తున్నాయి. పశ్చిమ అరుణాచల్‌ మొత్తాన్ని చైనా పట్టుకుని అసోం వచ్చింది. అసోం ప్రజలను తలచుకుంటే తన హృదయం ద్రవిస్తోందని నెహ్రూ ఒక సందేశం ఇచ్చారు. అసోం ప్రజల బాధ గురించి మాట్లాడారే కానీ.. చైనా ఆక్రమించిన ప్రతి అంగుళం భూమిని మన భారత బలగాలు వెనక్కి తెస్తాయని కానీ, ఎవరూ భయపడవద్దని కానీ నెహ్రూ చెప్పి ఉండాల్సింది” అని చుర‌క‌లు అంటించారు. అందుకే అస‌లు ఏం జ‌రిగిందో చూపించేందుకు మిమ్మ‌ల్ని(రాహుల్ స‌హా కాంగ్రెస్ ఎంపీలు) తీసుకువెళ్తా.. వ‌స్తారా? అని ప్ర‌శ్నించారు.

This post was last modified on August 9, 2023 12:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘ఎయిర్ బస్’ రూటు మనవైపు తిరిగేనా?

దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…

24 minutes ago

అట్టహాసంగా ప్రారంభమైన ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు

సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…

4 hours ago

టీడీపీలో సీనియ‌ర్ల రాజ‌కీయం.. బాబు అప్ర‌మ‌త్తం కావాలా?

ఏపీలోని కూట‌మి స‌ర్కారులో కీల‌క పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియ‌ర్ నాయ‌కుల వ్య‌వ‌హారం కొన్నాళ్లుగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. సీనియ‌ర్లు స‌హ‌క‌రించ‌డం…

9 hours ago

రేవంత్ సర్కారు సమర్పించు ‘మహా’… హైదరాబాద్

కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…

10 hours ago

లెక్క‌లు తేలుస్తారా? అమిత్ షాకు చంద్ర‌బాబు విన్న‌పాలు ఇవీ!

ఏపీ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్ర‌నేత అమిత్ షా వ‌ద్ద ఏపీ సీఎం చంద్ర‌బాబు…

11 hours ago

స‌స్పెండ్ చేస్తే.. మాతో క‌ల‌వండి: టీడీపీ నేత‌కు వైసీపీ ఆఫ‌ర్‌?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుంద‌న్న‌ది చెప్ప‌లేం. రాజ‌కీయాలు రాజ‌కీయాలే. ఇప్పుడు ఇలాంటి ప‌రిణామ‌మే ఎన్టీఆర్ జిల్లాలోనూ జ‌రుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…

12 hours ago