ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ కేసీఆర్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టింది. అయితే ఈ బిల్లు వెనుక సీఎం కేసీఆర్ వ్యూహం దాగి ఉందని తెలుస్తోంది. ఏ రకంగా చూసినా ఈ బిల్లుతో కేసీఆర్‌కే ప్రయోజనమే కలిగే అవకాశాలు ఉన్నాయి. మూడో సారి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్న కేసీఆర్.. ఆర్టీసీ బిల్లుతో మాస్టర్ ప్లానే వేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటు 40 వేలకు పైగా ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాల ఓట్లు తిప్పుకోవడంతో పాటు గవర్నర్‌ను, ఆపై బీజేపీని ఇరకాటంలో పెట్టడం కేసీఆర్ ప్లాన్‌గా కనిపిస్తోందని చెబుతున్నారు.
ఈ ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన కేసీఆర్.. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కసరత్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించారు. దీనిపై బిల్లును గవర్నర్‌కు పంపించారు. కానీ బిల్లులో మరింత స్పష్టత రావాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయని.. మరిన్ని వివరాలు పంపించాలంటూ సీఎస్‌ను గవర్నర్ అడిగారు. మరోవైపు గవర్నర్ బిల్లు ఆమోదం విషయంలో ఆలస్యం చేయడంతో ఆర్టీసీ కార్మికులు రాజ్‌భవన్ ముందు ధర్నాకు దిగారు.
ఈ బిల్లు పాసై ఎన్నికలకు ముందే ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైతే అప్పుడు ఈ కార్మికులు ఓట్లు బీఆర్ఎస్ ఖాతాలో చేరే అవకాశం ఉంది. ఒకవేళ అలా జరగక.. గవర్నర్ బిల్లును పెండింగ్‌లో పెడితే అప్పుడు గవర్నర్ మీదకు తోసేయొచ్చు. అంతే కాకుండా బీజేపీని కూడా లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయొచ్చు. పైగా ఇప్పటికే విలీనం చేస్తామని ప్రకటించామని, బిల్లు కూడా రూపొందించామని మళ్లీ అధికారంలోకి వస్తే తప్పకుండా అమలు చేస్తామని బీఆర్ఎస్ ఆశ చూపొచ్చు. ఇలా ఒక్క బిల్లు వెనుక కేసీఆర్‌కు కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.
This post was last modified on August 5, 2023 2:34 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…