మరో ఏడెనిమిది మాసాల్లో ఎన్నికలు జరగనున్న తెలంగాణలో బీజేపీ తరఫున పోటీ చేసేది వీరే అంటూ.. ఒక జాబితా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కొన్నాళ్ల కిందట.. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేవారి జాబితా ఒకటి తెరమీదకి వచ్చింది. ఇది అప్పట్లో సంచలనంగా మారింది. అయితే.. కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు మాత్రం ఈ జాబితాను అప్పట్లో ఖండించారు. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.
ఇదిలావుంటే, తాజాగా తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల నుండి పోటీ చేయనున్న అభ్యర్థుల మొదటి లిస్టు అంటూ.. బీజేపీ నేతల పేర్లతో ఓ భారీ జాబితా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీని ప్రకారం.. కేంద్ర మంత్రి బీజేపీ చీఫ్ గంగాపురం కిషన్ రెడ్డి అంబర్‌పేట, కే లక్ష్మణ్ ముషీరాబాద్, బండి సంజయ్ కరీంనగర్, సోయం బాపూరావు బోధ్, ధర్మపురి అరవింద్ ఆర్మూరు, ఈటెల రాజేందర్ గజ్వేల్, రఘునందన్ రావు…. దుబ్బాక, డీకే అరుణ…. గద్వాల్, జితేందర్ రెడ్డి… మహబూబ్ నగర్,
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. మునుగోడు నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది.
ఇక, కీలక నేత మురళీధర్ రావు వేములవాడ లేదా కూకట్‌పల్లి, ఎన్ ఇంద్రసేనారెడ్డి….. ఎల్బీనగర్, వివేక్….. చెన్నూరు, విజయశాంతి…. మెదక్, ఎండల లక్ష్మీనారాయణ…. నిజామాబాద్ అర్బన్, రామచంద్రరావు…. మల్కాజిగిరి, ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్…ఉప్పల్, ఆచారి….. కల్వకుర్తి, జయసుధ…. సికింద్రాబాద్, రాథోడ్ రమేష్…. ఆసిఫాబాద్, పొంగులేటి సుధాకర్ రెడ్డి…. ఖమ్మం , బాబు మోహన్… ఆందోల్, నందీశ్వర్ గౌడ్… పటాన్ చెరువు, బూర నర్సయ్య గౌడ్… భువనగిరి, విశ్వేశ్వర్ రెడ్డి… తాండూరు, గరికిపాటి మోహన్ రావు…. వరంగల్, ఈటెల జమున.. హుజూరాబాద్, విక్రమ్ గౌడ్… గోషామహల్ నుంచి పోటీ చేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిలో రాజాసింగ్ పేరు లేకపోవడం గమనార్హం.
This post was last modified on August 3, 2023 9:10 am
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…