Political News

న్యూడ్ కాల్..మాజీ సీఎం కొడుకుపై మహిళ ఫిర్యాదు

ఈ మధ్యకాలంలో దేశంలోని కొందరు నేతల కామ క్రీడలు రచ్చకెక్కి రాజకీయాలను భ్రష్టుపట్టించిన సంగతి తెలిసిందే. ఏపీలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఇక, మంత్రి అంబటి రాంబాబు ఆడియో టేప్ లీక్ వంటి వ్యవహారాలు ఇప్పటికీ వైరల్ గానే ఉన్నాయి. ఒక్క ఏపీలోనే కాదు….చాలా రాష్ట్రాలలో అధికార పార్టీకి చెందిన నేతాశ్రీలు..స్త్రీలోలులుగా మారి తమ పరువు తీసుకుంటున్నారు. తాజాగా ఈ కోవలోకే తమిళనాడు మాజీ సీఎం పన్నీరు సెల్వం కుమారుడు, అన్నాడీఎంకే నేత, థేనీ ఎంపీ రవీంద్రనాథ్ వస్తారు.

రవీంద్రనాథ్‌పై తాజాగా ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. తన కోరిక తీర్చాలంటూ ఎంపీ రవీంద్రనాథ్ తనను వేధిస్తున్నారంటూ తమిళనాడు డీజీపీకి ఓ మహిళ ఫిర్యాదు చేసిన వైనం సంచలనం రేపుతోంది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఆయన వేధింపులకు పాల్పడుతున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు, న్యూడ్ కాల్స్ చేయాలని తనను పదేపదే వేధిస్తున్నారని, ఒకవేళ తనకు లొంగకుంటే చంపేస్తానని బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించింది. ఈ వ్యవహారంపై తాను గతంలో తాంబారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని సదరు మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ క్రమంలోనే ఆమె ఫిర్యాదును పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. అయితే, రవీంద్రనాథ్ ఆల్రెడీ మరో వివాదంలో ఉన్నారు. 2019 ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తులు తప్పుగా చూపారంటూ రవీంద్రనాథ్ పై ఓ ఓటర్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో, విచారణ జరిపిన న్యాయస్థానం రవీంద్రనాథ్ ఎన్నిక చెల్లదని ఈ ఏడాది జులైలో తీర్పునిచ్చింది. అయితే, సుప్రీంకోర్టులో ఈ తీర్పును సవాలు చేసుకునేందుకు వీలుగా నెల రోజుల పాటు తీర్పు వాయిదా వేసింది. ఆల్రెడీ చిక్కుల్లో మూలిగే నక్కలా ఉన్న రవీంద్రరనాథ్ పై తాటికాయలాగా ఆ మహిళ ఆరోపణలు చేయడంతో మాజీ సీఎం కుమారుడు ఇరకాటంలో పడ్డారు.

This post was last modified on August 2, 2023 5:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇడియట్స్ జోలికి ఇప్పుడెందుకు వెళ్లడం

2009లో విడుదలైన బాలీవుడ్ మూవీ 3 ఇడియట్స్ ఒక సంచలనం. అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోని కాలేజీ స్టూడెంట్…

24 minutes ago

`స‌నాత‌న ధ‌ర్మం` స్టాండ్.. సాయిరెడ్డిని ర‌క్షిస్తుందా.. ?

వైసీపీ మాజీ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి మళ్ళీ రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల…

1 hour ago

సినిమా నచ్చకపోతే బాలేదని నలుగురికి చెప్పండి

ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయ‌డం అన్న‌ది పెద్ద రిస్క్‌గా మారిపోయిన మాట వాస్త‌వం. ఇంట‌ర్నెట్, ఓటీటీల విప్ల‌వం వ‌ల్ల…

5 hours ago

శుభవార్త చెప్పబోతున్న అఖండ 2 ?

గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…

8 hours ago

AI తెచ్చే ప్రమాదాల్లో ఇదింకా మొదటిది

తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…

8 hours ago

నీలంబరి ఎలా బ్రతుకుతుంది నరసింహా

డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…

9 hours ago