ఆమె మహిళా పార్లమెంటేరియన్. పైగా.. నటి. పశ్చిమ బెంగాల్‌కు చెందిన అధికార పార్టీ రాజకీయ నాయకురాలు. అయితే.. ఇప్పుడు ఆమె పేరు దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. ఇదేదో.. మంచి చేసినందుకు.. ఆదర్శంగా నిలిచినందుకు కాదు.. ఏకంగా 28 కోట్ల రూపాయలను ప్రజల నుంచి దోచేసినందుకట!! నమ్మడానికి కొంత ఇబ్బందిగా ఉన్నా.. నిజమేనని పోలీసులు కూడా చెబుతున్నారు. ఆమెపై కేసు కూడా నమోదు చేశారు.
ఎవరు? ఎందుకు?
పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నుంచి 2019లో ఎంపీగా గెలిచారు. సినీ నటి.. నుస్రత్ జహాన్. అప్పటి ఎన్నికల్లో భారీ మెజారిటీ కూడా దక్కించుకున్నారు. అయితే.. ఆమె సొంతగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. 24 ఉత్తరపరగణాల జిల్లాలో ఆమె భారీ వెంచర్‌ను వేస్తున్నానని చెప్పి.. పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చారు. హైక్లాస్ ఫెసిలిటీలతో.. త్రిబుల్ బెడ్ రూం ఇళ్లకు శ్రీకారం చుట్టానని..తక్కువ ధరలకే తన నియోజకవర్గం ప్రజలకోసం ఈ వెంచర్ వేసినట్టు ఆయన ప్రకటనలు గుప్పించారు.
దీంతో 429 మంది మధ్యతరగతి ప్రజలు ఆమెను నమ్మారు. పైగా సినిమాలు, సీరియళ్లలోనూ ఆమె కనిపిస్తుండడంతో ఈ నమ్మకం మరింత పెరిగింది. దీంతో రూ. 28 కోట్ల మేరకు వారంతా.. అడ్వాన్సులు చెల్లించారు. అయితే.. కాలం గడిచిపోయినా.. ఇక్కడ ఎలాంటి వెంచర్ పనులు కూడా ముందుకు సాగలేదు. దీంతో బాధితులు బయటకు వచ్చి.. ఎంపీకి వ్యతిరేకంగా కేసులు పెట్టారు. దీనిపై గరియాహట్ పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఎంపీపై అలిపోర్ కోర్టులో సైతం కేసు దాఖలు చేశారు. అయితే, ఈ అంశంపై ఎంపీ నుస్రత్ జహాన్ మౌనం వహించారు.
ఎలా నమ్మించారంటే..
నుస్రత్ జహాన్ డైరెక్టర్గా ఉన్న కంపెనీ తక్కువ ధరకే సొంత ఇల్లు కట్టిస్తామంటూ హామీ ఇచ్చింది. ఉత్తర 24 పరగణాలు జిల్లాలో కేవలం రూ.5.55 లక్షలకు త్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఇస్తామని చెప్పింది. వీటిని 2018లోగా కొనుగోలుదారులకు అందిస్తామని తెలిపింది. దీంతో దాదాపు 429 మంది సంస్థ చెప్పిన నగదును చెల్లించారు. దాదాపు 5 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ వాటిని అందించలేదు. దీంతో చేసేదేమీ లేక బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
This post was last modified on August 1, 2023 10:10 pm
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…
ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర నుంచి గ్లామర్ క్వీన్ ఇమేజ్ వైపు శరవేగంగా అడుగులేస్తున్న కథానాయిక కీర్తి సురేష్. దక్షిణాదిన…
https://youtu.be/g3JUbgOHgdw?si=jpCbsxB5cP_qeRwA ఇతర రాష్ట్రాల్లో ప్రభాస్ కాకుండా ఒక తెలుగు హీరోకి ఇంత క్రేజ్ ఏమిటాని అందరూ ఆశ్చర్యపోయే రీతిలో పుష్ప…