వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొంతకాలంగా చేస్తున్న విమర్శలు ఏపీ రాజకీయాలలో కాక రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ పై వైసీపీ నేతలు కూడా అదే స్థాయిలో ప్రతివిమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అమరావతిలోని వెంకటపాలెంలో జరిగిన ఆర్5 జోన్ ఇళ్ల పట్టాల పంపిణీ బహిరంగ సభలో పవన్ పై మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కు భార్యలను మార్చడం, పార్టీలను తార్చడం తప్ప ఏమీ తెలీదని జోగి రమేష్ షాకింగ్ కామెంట్లు చేశారు. పవన్ ఓ పిచ్చికుక్క అంటూ సంచలన విమర్శలు గుప్పించారు జోగి. పవన్ పెళ్లాలనే కాదు.. పార్టీలనూ మారుస్తాడంటూ విరుచుకుపడ్డారు.
మార్చటం, తార్చటం పవన్ కల్యాణ్ వెన్నతో పెట్టిన విద్య అని విమర్శలు గుప్పించారు. కుక్కలకు చిత్త కార్తె సీజన్ ఉంటుందని, ఆ టైంలో రోడ్డుపైకి కుక్కలు ఎక్కువగా వచ్చి మొరగడం వంటి రకరకాల కార్యక్రమాలు చేస్తుంటాయని, ఆ తరహాలోనే పవన్ వంటి చిత్త కార్తె కుక్కలు ఎన్నికల సీజన్ లో రోడ్లమీదకు వచ్చి అరుస్తున్నాయని షాకింగ్ కామెంట్లు చేశారు. చంద్రబాబు ముసలి నక్క , పవన్ కల్యాణ్ పిచ్చికుక్క అని దుయ్యబట్టారు. ఇక, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై కూడా జోగి విమర్శలు గుప్పించారు.
ఢిల్లీలో విగ్గు రాజుతో కలిసి ఏ పార్టీని ఏ పార్టీతో కలపాలో కంపెనీ పెట్టు అంటూ పవన్ పై జోగి సెటైర్లు వేశారు. సీఎం జగన్ పేదలకు అన్నం పెడుతున్నాడని, గూడు కల్పిస్తున్నాడని, జగన్ ను ఎవరూ టచ్ చేయలేరని అన్నారు జోగి రమేష్. జగన్ వెంట్రుక కూడా పీకలేరంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఊరపంది తిరిగినట్లు ఒకడు రోడ్ల పై తిరుగుతున్నాడు అంటూ లోకేష్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. మరి, జోగి రమేష్ వ్యాఖ్యలపై పవన్, జనసేన నేతల స్పందన ఏవిధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on July 24, 2023 7:12 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…