Political News

మోదీజీ టూర్ల కోసం 8458 కోట్ల‌తో రెండు విమానాలు

అన్నింటినీ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీకి లింక్ పెట్ట‌డం ఏంట‌ని ఆయ‌న అభిమానులు ఫీల‌వుతుండ‌వ‌చ్చు కానీ…ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో జ‌రుగుతున్న చ‌ర్చ మాత్రం హాట్ టాపిక్‌. అమెరికా అధ్యక్షుడు వినియోగించే ‘ఎయిర్‌ఫోర్స్ ఒన్’ విమానం తరహాలో రెండు బోయింగ్-777 ఈఆర్ విమానాలకు భారత్ గతంలో ఆర్డర్ ఇచ్చింది. వీటిలో ఒకటి సరఫరాకు సిద్ధంగా ఉంది.

దేశంలోని అత్యంత ప్రముఖ వ్యక్తులైన ప్రధాని, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పర్యటనల కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన ఈ ‘ఎయిర్ ఇండియా వన్’ విమానం త్వరలో భారత్‌కు చేరనుంది. అయితే, ఇప్పుడు రావ‌డంపైనే కొత్త చ‌ర్చ‌.

ప్రస్తుతం వీవీఐపీలు వినియోగిస్తున్న బీ 747 జంబో విమానాన్ని రాబోయే ఎయిర్ ఇండియా వ‌న్‌ భర్తీ చేస్తుంది. అమెరికాలో ‘ఎయిర్ ఇండియా ఒన్’ విమానానికి అన్ని పరీక్షలు ముగిశాయి. దీని వినియోగానికి అమెరికా ఫెడరల్ వైమానిక యంత్రాంగం సర్టిఫికెట్ కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ విమానాన్ని భారత్ కు తీసుకువచ్చేందుకు ఒక టీం అమెరికా బయలు దేరినట్లు ప్రభుత్వంలోని ఉన్నత వర్గాలు ఏఎన్ఐ వార్తా సంస్థకు వెల్లడించాయి.

మ‌న‌దేశంలోని వీవీఐపీల్లో అత్య‌ధికంగా ప‌ర్య‌ట‌న‌లు చేసేదే ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోదీ అనే సంగ‌తి తెలిసిందే. రాష్ట్రప‌తి త‌క్కువ‌గా ప‌ర్య‌టిస్తుంటారు. ఉప‌రాష్ట్రప‌తి నామ‌మాత్రంగానే. అంటే ఈ ప్ర‌తిష్టాత్మ‌క రెండు విమానాలు ప్ర‌ధానంగా మోదీజీ కోస‌మే వినియోగించ‌బ‌డ‌తాయి.

ఈ రెండు విమానాల‌కు పెట్టిన ఖ‌ర్చు దాదాపు రూ.8458 కోట్లు. గ‌తంలోనే ఈ మేర‌కు ఒప్పందం కుద‌ర‌డం, విమానాలు సిద్ధ‌మైపోయిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం ఆ విమానం దేశంలోకి రావ‌డ‌మే విమ‌ర్శ‌కుల‌కు చాన్స్ ఇస్తోంది. ఓ వైపు దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్రరూపం దాల్చుతుంటే మోదీజీ టూర్ల కోసం విమానాలు సిద్ధం చేసుకుంటున్నార‌ని ఇప్ప‌టికే మోదీజీ అంటే గిట్ట‌ని వాళ్లు ప్ర‌చారం మొద‌లుపెట్టేశారు కూడా!

This post was last modified on August 15, 2020 1:29 pm

Share
Show comments
Published by
Satya
Tags: Modi

Recent Posts

ఏపీలో.. టైం టేబుల్ పాల‌న‌!!

సాధార‌ణంగా ప్ర‌తి ప్ర‌భుత్వం త‌న ప‌ని తాను చేసుకుని పోతుంది. ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్ర‌ణాళిక‌లు.. కొన్ని…

3 hours ago

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

9 hours ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

10 hours ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

11 hours ago

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

14 hours ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

14 hours ago