Political News

బీజేపీ-జ‌న‌సేన పొత్తు.. జోగయ్య హాట్ కామెంట్స్‌

తాజాగా ఢిల్లీలో జ‌రిగిన‌ ఎన్డీయే మిత్ర‌ప‌క్షాల భేటీకి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ హాజ‌రు కావ‌డం, బీజేపీతో పొత్తు ఉంటుంద‌ని ఆయ‌న చెప్ప‌డం ప‌ట్ల మాజీ పార్ల‌మెంటు స‌భ్యుడు, కాపు సంక్షేమ సంస్థ అధ్య‌క్షుడు చేగొండి హ‌రిరామ జోగ‌య్య హాట్ కామెంట్స్ చేశారు. తాజాగా ఆయ‌న మీడియాకు విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో బీజేపీ.. కేవ‌లం జ‌న‌సేనను వాడుకునేందుకు చూస్తోంద‌ని అన్నారు. ప‌వ‌న్ కు ఉన్న చ‌రిష్మాను వాడుకుని ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొందాల‌ని బీజేపీ వ్యూహాలు రెడీ చేసింద‌ని చెప్పారు. అంతేకాదు.. ఏపీలో క్షేత్ర‌స్థాయిలో బీజేపీకి సానుభూతి లేద‌న్నారు.

అంతేకాదు.. ప‌వ‌న్‌తో క‌లిస్తే.. బీజేపీ బ‌ల‌ప‌డేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని కేంద్రంలోని పెద్ద‌లు చాలా వ్యూహాత్మ‌కంగా ప‌వ‌న్‌ను ద‌రి చేర్చుకున్నార‌ని జోగ‌య్య వ్యాఖ్యానించారు. ఫ‌లితంగా బీజేపీ-జ‌న‌సేన‌ల ఓటు బ్యాంకు 2 శాతం పెరుగుతుంద‌ని చెప్పారు. రాష్ట్రంలో విభ‌జ‌న చ‌ట్టానికి కాలం స‌మీపిస్తున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీ ఆ విభ‌జ‌న చ‌ట్టంలోని ఒక్క హామీని కూడా సంపూర్ణంగా నెర‌వేర్చ‌లేద‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నార‌ని, అందుకే.. బీజేపీ క్షేత్ర‌స్థాయిలో బ‌ల‌ప‌డ లేక పోతోంద‌ని.. ఈ నేప‌థ్యంలోనే ప‌వ‌న్‌ను చేర్చుకుని బ‌ల‌ప‌డేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని చెప్పారు.

ఏపీలో ఓట్ల శాతాన్ని పెంచుకోవడానికి, వైసీపీ ప్ర‌బుత్వాన్ని వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓడించడానికి బీజేపీ నేత‌లు చేస్తున్న ప్రయత్నాలు అంతంత మాత్రమే ఉన్నాయ‌ని జోగ‌య్య చెప్పారు. జగన్ ప్రభుత్వాన్ని ఓడించడానికి బీజేపీ ప్రయత్నం చేయకపోవడానికి ఆయనతో ఉన్న సత్సంబంధాలే కారణమ‌ని తేల్చిచెప్పారు. “పార్ల‌మెంటులో అవ‌స‌ర‌మైతే.. జ‌గ‌న్ కావ‌లి. ఇక్క‌డ అప్పులు కావాలంటే.. జ‌గ‌న్‌కు మోడీ కావాలి” అని జోగ‌య్య వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. జోగ‌య్య మ‌రిన్ని హాట్ కామెంట్లుకూడా చేశారు. రాష్ట్రంలో అధికారం చేపట్టడానికి బీజేపీతో జనసేన పొత్తు ఎంతవరకు లబ్ధి చేస్తుందనేది వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాతే తెలుస్తుందని జోగ‌య్య అన్నారు. ఈ రెండు పార్టీల పొత్తుతో బీజేపీకే ఎక్కువ లాభం జరిగనుంది. అలా కాకుండా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే అది జ‌న‌సేన‌కు మెరుగైన ఫ‌లితాన్ని ఇస్తుంది. ప‌లునియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పార్టీ గెలుస్తుందని చెప్పారు. ఒక వేళ ప‌వ‌న్ టీడీపీతో పొత్తు పెట్టుకున్నా ఐదేళ్ల‌పాటు ముఖ్య‌మంత్రి పీఠం ఆ పార్టీకే ఇస్తే.. స‌రికాద‌ని, కాపులు హ‌ర్ట‌వుతార‌ని కూడా జోగ‌య్య చెప్ప‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on July 20, 2023 11:15 am

Share

Recent Posts

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

2 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

2 hours ago

వీసా చేతిలో ఉన్నా రద్దే… అమెరికా కొత్త చెకింగ్ ఇదే!

అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…

2 hours ago

బొద్దింక‌ల నిర‌స‌న‌… ఈసారి ఇంకా గట్టిగా!!

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ).. తాజాగా మ‌రో ఉద్య‌మానికి తెర‌దీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…

3 hours ago

ఆ పరిస్థితిలో హనుమాన్ చాలీసాను పఠించిన కెప్టెన్

హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్ర‌మించేవారు కొంద‌రైతే.. తాము చేసిన ప‌నుల కార‌ణంగా చూపిన ధైర్య సాహ‌సాల కార‌ణంగా రాత్రికి…

4 hours ago

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

6 hours ago