సీఎం జగన్ పై జనసేనాని పవన్ కల్యాణ్ విమర్శల పరంపర కొనసాగుతూనే ఉంది. తణుకులో మాట్లాడిన పవన్ కల్యాణ్…జగన్ పై విమర్శలు గుప్పించారు. ధైర్యంతో పోరాడితే బ్రిటిష్ వారే పారిపోయారని, జగన్ ఎంత అని ప్రశ్నించారు. జగన్ గిచ్చాడని మోదీకి ఫిర్యాదు చేస్తే బాగోదని, జగ్గూ గ్యాంగ్‌ను హ్యాండిల్ చేయడం తమకు తెలుసుని అన్నారు. తన పోరాటం జగన్ పై కాదని, ప్రజా సమస్యలపై అని చెప్పారు.
జగన్ అనేవాడు తనకు ఆనడని, జగన్ పోతే రేపు మరో జగన్ వస్తాడని, తమ పోరాటం సమస్యలపై అని చెప్పారు. జగన్ ఒక రౌడీ పిల్లాడని చురకలంటించారు. తన కుటుంబం జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. వాలంటీర్ వ్యవస్థ అవసరం లేదని, కానీ, వాలంటీర్ వ్యవస్థలో యువతీవయుకుల సామర్థ్యాన్ని గుర్తించే ప్రయత్నం తాను చేస్తానని చెప్పారు. సమాజంపై ప్రేమతో తన ప్రాణాన్ని, తన కుటుంబాన్ని పణంగా పెట్టి వచ్చానని చెప్పారు.
వైసీపీ నేతల విమర్శలను తాను, తన కుటుంబం ఎందుకు ఎదుర్కోవాలని ప్రశ్నించారు. పంచాయతీ వ్యవస్థ ఉండగా సచివాలయ వ్యవస్థ ఎందుకని నిలదీశారు. ప్రజల మాన ప్రాణాలకు భంగం కలిగిస్తే తన అభిమానినైనా శిక్షించాల్సిందేనని పవన్ అన్నారు. టీడీపీకి జనసేన బీటీమ్ అని వైసీపీ నేతలు అనడం సహజమని, జనసేన పార్టీ వాళ్లు కూడా అనడం తనకు బ్బందిగా ఉందన్నారు. అబద్ధాలు చెప్పాల్సిన పని తనకు లేదన్నారు.
శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడిని సీఐ అంజూయాదవ్ చెంపదెబ్బ కొట్టడంపై పవన్ స్పందించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నాయకుడిని చెంపదెబ్బ కొట్టడం ఏంటని ప్రశ్నించారు. పార్టీ నేతలకు అండగా నిలిచేందుకు శ్రీకాళహస్తి వెళ్లనున్నట్లు పవన్ తెలిపారు. రాజకీయాల్లో ఎదురుదాడి అలవాటు చేసుకోవాలని జనసేన నాయకులు, కార్యకర్తలకు సూచించారు.
This post was last modified on July 14, 2023 5:56 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…