ఔను.. రాజకీయాల్లో నాయకులు ఇచ్చే నినాదాలకు చాలా వాల్యూ ఉంటుంది. ఇవి ప్రజల్లోకి వెళ్తే.. మైలేజీ పెరుగుతుందని.. తద్వారా తాము గెలుపు గుర్రం ఎక్కుతామని కూడా లెక్కలు వేసుకుంటారు. ఇలానే.. వైసీపీ అదినేత జగన్ గత ఎన్నికలకు ముందు.. అనేక నినాదాలతో ముందుకు సాగారు. ఇక, అధికారం లోకి వచ్చాక కూడా.. కొన్ని నినాదాలు ఇచ్చారు. ప్రజల మధ్యకు తీసుకువెళ్లారు. వీటిలో జగనన్నే మా భవిత
– మా నమ్మకం నువ్వే జగన్
వంటివి మచ్చుకు తెలిసిందే.
అయితే.. వీటికన్నా ఎక్కువగా సీఎంజగన్ మరో నినాదం ఇచ్చారు. అదే.. ‘వైనాట్ 175’ ఓ నాలుగు నెలల వెనక్కి వెళ్తే.. ఈ నినాదం పెద్దగా వినిపించింది. వైసీపీ నాయకులు భారీగానే ప్రచారం చేశారు. కానీ, ఎందుకో.. ఇటీవల కాలంలో ఈ నినాదాన్ని.. అటు సీఎం, ఇటు నాయకులు కూడా ఎక్కడా పలకడం లేదు. నిజానికి సీఎం జగన్ ఎక్కడ ఏ వేదిక ఎక్కినా.. కొన్నాళ్ల కిందట వైనాట్ 175 అనేవారు. కానీ, ఇటీవల కాలంలో ఆయన పాల్గొనే సభల్లోనూ ఈ నినాదాన్ని మరిచిపోయారు.
ఇప్పుడు ఎన్నికలు ముంచుకు వస్తున్న నేపథ్యంలో ఈ నినాదం ఏమైందనే చర్చ వైసీపీలో ఎక్కువగా సాగుతోంది. వైనాట్ 175 నినాదాన్ని వదిలేశారా? అని కొందరు ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే.. దీనిని ప్రస్తుతానికి పక్కన పెట్టారని.. క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనించిన తర్వాత.. ఇలాంటి నినాదాలు ఇచ్చి.. ఇబ్బందులు తెచ్చుకోవడం ఎందుకని భావిస్తున్నారని.. కొందరు సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే.. మరికొన్నాళ్లపాటు క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనించి.. అన్ని నియోజకవర్గాల్లోనూ గెలిచే అభిప్రాయం. ఉంటే.. ఎన్నికలకు ముందు ఈ నినాదాన్ని మరింత వేగంగా ప్రజల మధ్యకు తీసుకువెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికైతే.. ఈ నినాదాన్ని పక్కన పెట్టారనే అంటున్నారు. ఇదిలావుంటే.. వైనాట్ 175 అని వైసీపీ నినదించగానే.. టీడీపీ అధినేత చంద్రబాబు వైనాట్ పులివెందుల అనే నినాదం తెరమీదికి తెచ్చారు. వైసీపీ నాయకులు వైనాట్ నినాద్ పక్కన పెట్టగానే ఈయన కూడా ఆనినాదాన్ని పక్కన పెట్టడం చిత్రం!
This post was last modified on July 14, 2023 10:43 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…