గూగుల్ సెర్చ్‌లో ప్రతి రోజూ ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్లు అనేక విషయాలను సెర్చ్ చేస్తారు. ఇలా సెర్చ్ చేసిన వాటిలో ట్రెండింగ్‌లో ఉన్నదానికి ప్రాధాన్యం ఉంటుంది. దీనిని గూగుల్ కూడా ప్రకటిస్తుంది. ఇక, ప్రాంతాల పరంగా కూడా ఈ ట్రిండింగులు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. కొన్నాళ్ల కిందట అంతర్జాతీ య బ్యాట్‌మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఒలింపిక్ పతకాన్ని సాధించినప్పుడు.. గత ఎన్నికల్లో సీఎం జగన్ మెజారిటీ భారీగా దక్కించుకున్నప్పుడు.. వారి గురించి నెటిజన్లు భారీగా శోధించారు.
ఇప్పుడు ఈ పరంపరలో తెలంగాణలోని ములుగు నియోజకవర్గం ఎమ్మెల్యే, ఫైర్‌బ్రాండ్ సీతక్క నిలిచారు. గూగుల్ సెర్చ్ ఇంజన్‌లో గడిచిన 18 గంటల్లో తెలుగు రాష్ట్రాల పరంగా ఎక్కువగా సెర్చ్ చేసింది సీతక్క బయోడేటా గురించే కావడం గమనార్హం. నెటిజన్ల అభిప్రాయం ప్రకారం.. సీతక్కకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆమెను తెలంగాణ ముఖ్యమంత్రి ఎందుకు చేయకూడదన్న తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యల తర్వాత.. సీతక్క గురించి పెద్ద ఎత్తున నెటిజన్లు సెర్చ్ చేశారు.
నెటిజన్ల ఆసక్తి వీటిపైనే..
- ప్రధానంగా సీతక్క అసలు పేరు ఏంటి?
- ఆమె ఏం చదుకున్నారు?
- గతంలో మావోయిస్టుగా ఎక్కడెక్కడ ఏం చేశారు?
- ఎన్నాళ్లుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు?
- కుటుంబ నేపథ్యం.. భర్త, పిల్లలు..
- ఆమె రాజకీయ ప్రస్తానం.. సహా ప్రసంగాలు..
- కాంగ్రెస్‌లో ఆమెకు ఉన్న ప్రాధాన్యంపైనా కొందరు నెటిజన్లు సెర్చ్ చేయడం గమనార్హం. దీంతో సీతక్క.. అలియాస్ ధనసరి అనసూయ పేరు సెర్చ్ ఇంజన్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉండడం గమనార్హం.