ఏది ఉత్తనే జరగదు. అందునా.. రాజకీయాల్లో జరిగే ప్రతి అంశానికి వెనుక ఒక లెక్క ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న కొన్ని పరిణామాలు ఇందుకు నిదర్శనంగా చెప్పాలి. గడిచిన కొద్దిరోజులుగా చూస్తే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాంహౌస్ లో గడిపే రోజులు అంతకంతకూ పెరుగుతున్నాయి. అదే సమయంలో.. మంత్రి కేటీఆర్ తన పరిధిని పెంచుకుంటున్న వైనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.
ఎవరు అవునన్నా కాదన్నా.. అధికారం కాకున్నా అనధికారికంగా అయినా సరే.. కేసీఆర్ రాజకీయ వారసుడు కేటీఆర్ అన్న విషయం మీద ఎవరికి ఎలాంటి అనుమానం లేదు. ఆ మధ్య వరకు కొందరికి కొన్ని సందేహాలు ఉన్నా.. గడిచిన ఏడాదిలో అలాంటివి పూర్తిగా తొలిగిపోయాయి. మరీ ముఖ్యంగా లాక్ డౌన్ వేళ మొదలుకొని కేసీఆర్ తన పరిధిని అంతకంతకూ తగ్గించుకుంటుంటే.. అందుకు భిన్నంగా కేటీఆర్ మాత్రం తన పరిధిని పెంచుకుంటున్నారు.
రెండు..మూడు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఒక రివ్యూ మీటింగ్ నిర్వహించారు. యథావిధిగా పక్కరోజు అన్న పేపర్లలో ఆ వార్త వచ్చింది. కానీ.. కేబినెట్ తరహాలో మంత్రులంతా హాజరు కావటమే కాదు.. కీలక అధికారులు సైతం హాజరయ్యారు. దీనిపై రగడ మొదలుకాకుండా ఉండటానికి వీలుగా.. కాస్త ఆలస్యంగా ట్విట్టర్ పేజీలో రివ్యూ గురించి ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆ తర్వాత నుంచి కొన్ని మీడియాల్లోనూ.. చానళ్లలోనూ కేటీఆర్ పట్టాభిషేకమన్న కథనాలు టెలికాస్ట్ కావటం తెలిసిందే.
కేటీఆర్ ముఖ్యమంత్రిని చేసేందుకు కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నారన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉన్నదే. కానీ.. ఈ తరహాలో కేబినెట్ ను కొలువు తీర్చి దానికి కేటీఆర్ లీడ్ చేయటం మాత్రం ఇప్పటివరకు ఏ నేత.. ఏ అధినేత వారసుడు చేసింది లేదు. అందుకు భిన్నంగా కేటీఆర్ భేటీ నిర్వహించారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. సీఎం కేసీఆర్ ఫాంహౌస్ కు వెళ్లిన పక్క రోజునే నిర్వహించటం. ఒక కీలకమైన రివ్యూ సమావేశాన్ని నిర్వహించాలనుకుంటే.. ముందు రోజే పెట్టేసుకోవచ్చు. లేదంటే.. ఆ రివ్యూ అయ్యాక అయినా సీఎం కేసీఆర్ ఫాంహౌస్ కు వెళ్లే అవకాశం ఉంది. కానీ.. అలా ఏమీ జరగకుండా కేటీఆర్ నాయకత్వంలో రివ్యూ జరగటం చూస్తే.. పట్టాభిషేకానికి ముందు ట్రయల్ రన్ లా దీన్ని చెప్పక తప్పదు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో కేటీఆర్ పట్టాభిషేక కార్యక్రమం ఉండకపోవచ్చనే అంటున్నారు. కాకుంటే.. విపత్తు వేళలోనూ మంత్రి హోదాలో ఉన్న ఆయన ఎంత చురుగ్గా వ్యవహరించారన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చేయటం కోసమే ఇదంతా అన్న మాట వినిపిస్తోంది. ఈ కారణంతోనే.. అదే పనిగా హైదరాబాద్ తో పాటు.. చుట్టుపక్కల జిల్లాల్లో జరిగే అన్ని డెవలప్ మెంట్ యాక్టివిటీస్ కు హాజరుకావటమేకాదు.. శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలకు విరివిగా పాల్గొంటున్నారు. ఇదంతా చూస్తున్నప్పుడు కేటీఆర్ పట్టాభిషేకానికి ముందు.. సన్నదత ఎలా ఉందన్న విషయాన్ని తెలుసుకునే ట్రయల్ రన్ లాంటిదే తాజా పరిస్థితి అని చెబుతున్నారు. అందులో నిజమెంతో కాలం మాత్రమే కచ్ఛితంగా చెప్పగలదు.
This post was last modified on August 15, 2020 9:40 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…