వైసీపీ అధినేత, సీఎం జగన్ ఇప్పటి వరకు ఎమ్మెల్యేలపై దృష్టి పెట్టారు. వారిని లైన్‌లో పెట్టే కార్యక్రమాల కు ఆయన శ్రీకారం చుట్టారు. వారిని ప్రజల మధ్యకు పంపిస్తున్నారు. అంతేకాదు.. వెళ్లనివారిని హెచ్చరి స్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది కూడా లేదని చెబుతున్నారు. ఇక, దీంతో ఎమ్మెల్యేలు అంతో ఇంతో లైన్‌లో లేరని భావించిన వారు కూడాలైన్‌లో పడ్డారు. దీంతో ఇప్పుడు సీఎం జగన్ ఎంపీలపై దృష్టి పెట్టినట్టు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం ఎంపీల విషయానికి వస్తే.. గత ఎన్నికల్లో 22 మంది ఎంపీలు వైసీపీటికెట్‌పై విజయం దక్కించుకు న్నారు. వీరిలో ఒకరు రెబల్‌గా మారగా.. 21 మంది వైసీపీలోనే ఉన్నారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో తాము ఎంపీగా పోటీ చేయలేమని.. నలుగురు ఎంపీలు ఇప్పటికే అధిష్టానానికి ముఖతా సమాచారం ఇచ్చారు. వీరిలో బీశెట్టి సత్యవతి, గొట్టేటి మాధవి, ఎంవీవీ సత్యనారాయణ, వంగా గీత ఉన్నారు. వీరు ఎట్టి పరిస్థితిలోనూ పార్లమెంటుకు పోటీ చేసేది లేదని తెగేసి చెప్పేశారు.
ఇక, అప్పటి నుంచి దాదాపు పార్లమెంటు నియోజకవర్గంతో సంబంధాలు కూడా ఆ నాయకులు తెంచేసుకు న్నారు. ఇదిలావుంటే.. నాయకుల పరిస్థితి ఎలా ఉన్నా.. అధిష్టానం అవసరం కోసం.. నలుగురు ఎంపీలను పార్టీనే అసెంబ్లీకి పంపించేందుకు ప్రయత్నిస్తోంది. ఇలాంటి వారిలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ఉన్నారు.
అంటే.. మొత్తంగా వారు కోరుకున్నా.. పార్టీ కోరుకున్నా.. 8 మంది ఎంపీలకు స్థాన చలనం తప్పేలా కనిపించడం లేదు. దీంతో ఆయా నియోజకవర్గాలకు కొత్తవారిని ఎంపిక చేయాల్సి ఉంది. ఇదిలావుంటే.. మూడు నియోజకవర్గాల్లో వైసీపీ ఓడిపోయిన దరిమిలా.. ఆయా నియోజకవర్గాలకూ కొత్తవారి కోసం వేట సాగుతున్నట్టు సమాచారం. వీటిలో ప్రధానంగా విజయవాడకు సినిమా రంగం నుంచి నటుడికి అవకాశం ఇస్తారని అంటున్నారు.
ఒకవేళ ఎన్నికల నాటికి విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని వైసీపీ తీర్థం పుచ్చుకుంటే.. ఆయనకు అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా శ్రీకాకుళం, గుంటూరు నియోజకవర్గాలపై ఇంకా దృష్టి పెట్టలేదు. దీంతో ఈ నెల 15 నుంచి ఎంపీల తీరుతెన్నులు.. పనితీరు.. సహా.. వారి మార్పులపైనా చర్చసాగుతుండడం గమనార్హం. నరసారావుపేట నుంచి ఈ సారి బాలశౌరిని రంగంలోకి దింపే అవకాశం ఉందని బలంగా వినిపిస్తోంది.
This post was last modified on July 11, 2023 2:30 pm
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…