అసెంబ్లీ ఎన్నికలు అత్యంత వేగంగా సమీపిస్తున్నాయి. షెడ్యుల్ ప్రకారం జరిగితే.. 9 నెలలు.. ముందస్తు వస్తే.. నాలుగైదు మాసాలే గడువుంది. దీంతో రాజకీయాలు, రాజకీయ నాయకులు కూడా వేగంగా రియాక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో తమకు అనుకూలంగా వేదికలను వారు ఎంచుకుంటున్నారు. ఈ వ్యవహ రంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట నియోజకవర్గం ముందుందని అంటున్నారు పరిశీల కులు.
ఆచంట నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీ నాయకులు, సీనియర్ నేత.. చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఉన్నారు. గత 2019 ఎన్నికలకు ముందు జగన్ చేపట్టి పాదయాత్ర సమయంలో పార్టీలో చేరిన ఆయన ఎన్నికల్లో టికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో ఆయన విజయం కూడా సాధించి.. మంత్రి వర్గంలో స్థానం సంపాయించుకున్నారు. అయితే, రెండో దఫా విస్తరణలో ఆయన మంత్రి స్థానాన్ని కోల్పోయారు.
ఇక, నియోజకవర్గం విషయానికి వస్తే.. ఆయన దూకుడు మంత్రిగా ఉన్నప్పుడు బాగానే పని చేసింది కానీ.. ఇప్పుడు లేదనే టాక్ సొంత పార్టీ నేతల్లోనేఎక్కువగా వినిపిస్తోంది. మరోవైపు.. పాలకొల్లు, ఉండి నియోజక వర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేల దూకుడు.. ఆచంటపై పరోక్షంగా ప్రభావం చూపిస్తోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో ఓడిపోయిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణకు గ్రాఫ్ పెరుగుతున్నట్టు తమ్ముళ్ల మధ్య గుస గుస వినిపిస్తోంది.
దీంతో వైసీపీలోని మండలస్థాయి నాయకులు.. టీడీపీ చెంతకు చేరుతున్నారు. దీపం ఉండగానే అన్నట్టుగా.. తమ దారి తాము చూసుకుంటున్నారు. ఆచంట నియోజకవర్గంలో పితాని గతంలోనూ గెలిచి ఉండడం.. కాంగ్రెస్‌లోనూ చక్రం తిప్పిన దరిమిలా.. రాష్ట్రంలో మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా ఇప్పుడు ఆయన చుట్టూ రాజకీయం మారుతోందని.. మండల స్థాయి నాయకులు వైసీపీ నుంచి టీడీపీ బాట పడుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతోంది.
This post was last modified on July 11, 2023 9:05 am
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…