భారత ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ టూర్ లో భాగంగా హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో జరిగిన బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు. బీజేపీ విజయసంకల్ప సభలో ప్రసంగించిన మోడీ….సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ కుటుంబంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు నిఘా పెట్టాయని, ఆ దృష్టి మరల్చేందుకే కొత్త నాటకాలు ఆడుతున్నారని మోడీ మండిపడ్డారు. అవినీతి ఆరోపణలు డైవర్ట్ చేసేందుకే కేసీఆర్ కొత్త ప్లాన్స్ వేస్తున్నారని, వాటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మోడీ పిలుపునిచ్చారు.
కుటుంబ పార్టీల వల్ల తెలంగాణ వెనుకబాటుకు గురవుతోందని, కేంద్రాన్ని విమర్శించడమే కేసీఆర్ సర్కారు పనిగా పెట్టుకుందని విమర్శలు గుప్పించారు. లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ్చిన కేసీఆర్….టీఎస్పీఎస్సీ స్కామ్ ద్వారా వారిని మోసం చేశారని ఆరోపించారు. 300 అధ్యాపకుల పోస్టులు తెలంగాణ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నాయని, వేల సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు కూడా పాఠశాలల్లో భర్తీ కావాల్సి ఉందని చెప్పారు. ఉద్యోగులకు కేసీఆర్ ద్రోహం చేశారని మండిపడ్డారు. కేంద్రం ఎన్నో అభివృద్ధి పనులు చేస్తుంటే రాష్ట్రం ఏమీ చేయడం లేదని మోడీ ఆరోపించారు.
అవినీతి కోసం తెలంగాణ, ఢిల్లీ కలిసి పనిచేయడం దౌర్భాగ్యం అని లిక్కర్ స్కామ్ ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అవినీతి ఢిల్లీ వరకు పాకిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీ కార్యకర్తగా వరంగల్ ప్రజల ముందుకు వచ్చానని, పౌరుషానికి వరంగల్ పెట్టింది పేరు అని మోడీ అన్నారు. జన్ సంఘ్ నుంచే వరంగల్ తమకు కంచుకోట అని, హనుమకొండ నుంచి గెలిచిన చందుపట్ల జంగారెడ్డి గురించి అందరికీ తెలుసు అని మోడీ అన్నారు. 2021 మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ట్రైలర్ చూపించిందని, రాబోయే ఎన్నికల్లో సినిమా చూపిస్తుందని అన్నారు.
దేశాభివృద్ధిలో తెలంగాణ పాత్ర కీలకమని, మేడిన్ ఇండియాకు తెలంగాణ ఎంతో సహకారం అందించిందని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ అడ్రస్ లేకుండా చేస్తామని, ఆ పార్టీలు తుడిచిపెట్టుకు పోవడం ఖాయమని జోస్యం చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు పనులు చేసిందని ఎద్దేవా చేశారు. లేచింది మొదలు మోడీకి తిట్టడమే మొదటి పని అని, కుటుంబ పార్టీని, కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించడం రెండో పని అని చురకలంటించారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడం, అప్పులు చేయడం మూడో పని అని, అవినీతిలో కూరుకుపోవడం నాలుగో పని అని మండిపడ్డారు.
This post was last modified on July 8, 2023 10:25 pm
ఎప్పుడో 2012లో మొదలైన తమిళ సినిమా.. మద గజ రాజా. కొన్ని కారణాల వల్ల మేకింగ్లో ఆలస్యం జరిగి.. 2013…
ఏపీ రాజధాని అమరావతి రైతులకు సీఎం చంద్రబాబు పండగ పూట భారీ కానుక అందించారు. గత ఏడాదిన్నరగా నిలిచి పోయిన…
బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు సంక్రాంతి వేళ భారీ ఎదురు దెబ్బ తగిలింది.…
క్వీన్, మణికర్ణిక లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీస్తో ఒక టైంలో బాలీవుడ్లో తిరుగులేని స్థాయిని అందుకుంది కంగనా. అప్పట్లో ఆమెకు…
సంక్రాంతి పండుగ అంటేనే అందరికీ వేడుక. కలవారు.. లేనివారు అనే తేడా లేకుండా చేసుకునే పండుగ ఇది. కనీసంలో కనీసం..…
రెండున్నర గంటలు అండర్ కవర్ ఆపరేషన్ చేసి సినిమా చివర్లో ట్విస్ట్ ఇచ్చే హీరోలాగా పండగ బరిలో లాస్ట్ వచ్చిన…