ఏపీ సీఎం జగన్ ఇరుకున పడుతున్నారా? కేంద్రంతో ఆయన తెరచాటున చేతులు కలిపినా.. ఇప్పటి వరకు పెద్దగా ముప్పురాలేదు. వచ్చినా.. సరిచేసేందుకు సర్ది చెప్పేందుకు సాయిరెడ్డి వంటి కీలక నాయకులు ముందున్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని కూడా తమ వ్యూహాలతో కాపాడుకున్నారు. అయితే.. ఇప్పుడు పోయిపోయి.. జగన్ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారనే చర్చ సాగుతోంది.
అదే.. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నెలలో పార్లమెంటులో ప్రవేశ పెట్టనున్న ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు జగన్ మద్దతు ప్రకటించడం తప్పని సరి అవుతోంది. ఎందుకంటే.. వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలోని మోడీ సర్కారు మద్దతు జగన్ కు ఎంతో కీలకంగా మారనుంది. దీంతో ఇష్టం ఉన్నా.. లేకున్నా.. ఆయన ఉమ్మడి పౌరస్మృతికి మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది.
అయితే.. ఈ బిల్లుకు మద్దతు తెలిపితే.. జగన్‌కు కొంత వరకు నష్టం జరిగే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. ఉమ్మడి పౌరస్మృతిని ముస్లిం సామాజిక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమ స్వేచ్ఛ, తమ మతంపై జరుగుతున్న దాడిగా పేర్కొంటున్న ఈ సామాజిక వర్గం జగన్‌పై ఆగ్రహించే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ఇదే జరిగితే..కొన్నేళ్లుగా ముస్లింలు జగన్‌కు అండగా ఉంటున్న పరిస్థితి తెరమరుగు అయ్యే ఛాన్స్ కనిపిస్తోందని లెక్కలు వేసుకుంటున్నారు.
ఫలితంగా రాష్ట్రంలో ముస్లింల ఓట్లపై జగన్ నిర్ణయం ప్రభావం చూపిస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే.. ఇదే విషయంలో మరోవైపు ఇతర పార్టలు సైతం.. మోడీ సర్కారుకు జై కొట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇది తమకు లాభిస్తుందని.. తాము ఒక్కరే కాకుండా.. అన్ని పార్టీలు ఉమ్మడి పౌరస్మృతికి జై కొట్టిన నేపథ్యంలో తమకు ప్రత్యేకంగా వచ్చే ఇబ్బంది లేదని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఏదేమైనా.. కీలక ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ ప్రధాన అంశంతో జగన్ కు ఇబ్బందులు అయితే.. తప్పవనే ది మెజారిటీ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది.
This post was last modified on July 6, 2023 10:54 am
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…
ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర నుంచి గ్లామర్ క్వీన్ ఇమేజ్ వైపు శరవేగంగా అడుగులేస్తున్న కథానాయిక కీర్తి సురేష్. దక్షిణాదిన…