ఏపీ సీఎం జగన్ దిల్లీ పర్యటనపై ఎప్పటిలాగే అనేక ఊహాగానాలు వస్తున్నాయి.. అదే సమయంలో వైసీపీ నేతలు కూడా ఎప్పటిలాగే జగన్ రాష్ట్రం కోసమే వెళ్లారంటూ చాంతాడంత లిస్ట్ చెప్తున్నారు. బుధవారం ఉదయం దిల్లీ వెళ్లిన జగన్ ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌లతో భేటీ అయ్యారు. సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో జగన్, మోదీల భేటీ జరగ్గా 25 నిమిషాల పాటు ఇద్దరి మధ్య భేటీ కొనసాగినట్లు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. అమిత్ షా తో జగన్ సమావేశం సుదీర్ఘంగానే సాగింది. మోదీ కంటే ముందు అమిత్ షాతో జగన్ భేటీ అయ్యారు. ఇద్దరూ సుమారు 45 నిమిషాలు చర్చలు జరిపారు.
పోలవరం ప్రాజెక్టు, జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో హేతుబద్ధత, విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలు, కొత్త మెడికల్ కాలేజీలకు ఆర్థిక సహాయం తదితర అంశాలను జగన్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారని సీఎం కార్యాలయం చెప్తున్నప్పటికీ ఎన్నికల అంశాలపైనా ఇద్దరు నేతలపై చర్చ జరిగినట్లు వినిపిస్తోంది. ముఖ్యంగా ముందస్తు ఎన్నికల అంశం చర్చించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగాల్సిన నాలుగు రాష్ట్రాలతో పాటు ఏపీకి కూడా ఎన్నికలు జరిగేలా సహకరించాలని మోదీని జగన్ కోరినట్లుగా చెప్తున్నారు. మరోవైపు కేంద్ర మంత్రివర్గ విస్తరణ త్వరలో ఉండనుండడంతో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో చేరాలని బీజేపీ నుంచి ఆఫర్ వచ్చిందన్న ప్రచారం కూడా దిల్లీ స్థాయిలో జరుగుతోంది. అన్నీ అనుకున్నట్లు కుదిరితే విజయసాయిరెడ్డికి మోదీ కేబినెట్లో మంత్రి పదవి దొరకొచ్చన్న మాట వినిపిస్తోంది.
అయితే, సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ప్రకటన ప్రకారం చూస్తే మాత్రం పోలవరం నిధులపై జగన్ మోదీ వద్ద గట్టి పట్టుపట్టినట్లుగా తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణవ్యయం రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపాలని, సుదీర్ఘకాలంగా ఇది పెండింగ్‌లో ఉందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన జగన్.. ప్రాజెక్టు తొలిదశ నిర్మాణానికి రూ.17,144 కోట్లు అవసరం అవుతుందని, ఇది కేంద్ర జలశక్తి శాఖ పరిశీలనలో ఉందని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు తొలిదశ నిర్మాణానికి కేంద్ర ఆర్థికశాఖ ఇప్పటికే రూ.12911.15 కోట్ల మంజూరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, అయితే రూ.17144 కోట్లు ఇవ్వాలని కోరారు. దీనికి మోదీ నుంచి సానుకూలత వచ్చినట్లుగా చెప్తున్నారు.
అయితే.. ముందస్తు ఎన్నికల విషయంలోనూ జగన్ అందుకు సంబంధించి ముందడుగు వేస్తే ఎన్నికలు నిర్వహించడానికి ఈసీకి ఎలాంటి ఇబ్బందీ ఉండదని బీజేపీ పెద్దలు సూచించినట్లుగా తెలుస్తోంది. దీంతో జగన్ ముందస్తు ఆలోచనకు మోదీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లేనంటున్నారు.
This post was last modified on July 6, 2023 6:23 am
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై ఈసారి చాలా ఆసక్తిగా మారబోతోన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి దుబాయ్, పాకిస్థాన్ వేదికలుగా…
తీవ్ర వివాదాలు ఎదురుకుంటూ విపరీతమైన వాయిదాలకు లోనవుతూ వచ్చిన ఎమర్జెన్సీ ఇటీవలే విడుదలయ్యింది. క్రిష్ వదిలేశాక మణికర్ణిక బ్యాలన్స్ పూర్తి…
కరోనా తర్వాత థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిన మాట వాస్తవం. కొవిడ్ టైంలో ఓటీటీలకు బాగా అలవాటు పడ్డాక..…
ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీకి ఫౌజీ టైటిల్…
టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమాలకు కాస్తంత గ్యాప్ ఇచ్చినట్టే కనిపిస్తున్నారు. ఈ సంక్రాంతికి డాకు…