గత కొద్ది రోజులుగా తెలంగాణ బీజేపీ వ్యవహారాలు ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను తప్పించబోతున్నారని, ఆ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమించబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును కూడా తప్పించబోతున్నారని పుకార్లు వస్తున్నాయి. తాజాగా, ఆ పుకార్లకు తగ్గట్లుగానే అయితే తెలంగాణ, ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షులను ప్రకటించారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమిస్తూ అధికారిక ప్రకటన వెలువడింది. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధరేశ్వరికి దక్కింది. అనూహ్యంగా చివరి నిమిషంలో ఆమె పేరు తెరపైకి వచ్చింది. మరోవైపు, తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా చేశారు. ఇక, ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్ చేసి చెప్పారు.
తెలంగాణ బీజేపీ చీఫ్ పదవి రేసులో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో పాటు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయితే బిజెపి హై కమాండ్ కిషన్ రెడ్డి వైపే మొగ్గు చూపింది. ఈటలతోపాటు రఘు నందన్ రావు కూడా పార్టీపై అలకబూనారని ప్రచారం జరిగినా..తాను బిజెపికి విధేయుడినని, బిజెపిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని రఘునందన్ రావు వివరణ ఇచ్చారు. కాగా, సోము వీర్రాజుకు రాష్ట్ర స్థాయిలోనే ఇతర బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. బండి సంజయ్ కు కేంద్ర స్థాయలో లేదా రాష్ట్ర స్థాయిలో పదవి దక్కే అవకాశముంది.
This post was last modified on July 4, 2023 3:44 pm
అమెరికాలో విడుదల కాబోయే విదేశీ సినిమాలకు ఇకపై వంద శాతం టారిఫ్ విధిస్తున్నట్టు ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ప్రకటించడం ఒక్కసారిగా…
గత కొన్నేళ్లలో తమిళ సినిమాల క్వాలిటీ బాగా పడిపోయిన మాట వాస్తవం. ఒకప్పుడు దేశంలోనే అత్యుత్తమ సినిమాలు తీసే ఇండస్ట్రీగా…
కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రెసిడెంట్ చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారం అందుకున్న బాలకృష్ణకు పౌరసన్మాన సభ ఘనంగా జరిగింది. వేలాదిగా…
టీడీపీకి ప్రాణ సమానమైన కార్యక్రమం ఏదైనా ఉంటే.. అది మహానాడే. దివంగత ముఖ్యమంత్రి, తెలుగువారిఅన్నగారు ఎన్టీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని..…
మే 9 విడుదల కాబోతున్న సినిమాల్లో సమంత నిర్మించిన శుభం ఉంది. ప్రొడ్యూసర్ గా వ్యవహరించడమే కాదు ఒక క్యామియో…
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ రెండు రోజుల కిందటే అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించారు. రాజధాని పనులకు పునః ప్రారంభం కూడా…