అనంతపురం జిల్లా తాడిపత్రి టౌన్ సీఐ ఆనందరావు ఆత్మహత్య ఏపీ రాజకీయాలలో పెను దుమారం రేపింది. తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆనందరావు సూసైడ్ చేసుకున్న ఘటన వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. వైసీపీ నేతల ఒత్తిళ్ల వల్లే ఆనందరావు ఆత్మహత్యకు పాల్పడ్డారని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అయితే, ఆ ఆరోపణలను తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఖండిస్తున్నారు.
రాజకీయ ఒత్తిళ్లు, కుటుంబ కలహాల కోణాల్లో కూడా ఆనందరావు ఆత్మహత్య కేసును దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. పని ఒత్తిడి వల్లే తన తండ్రి చనిపోయారని ఆనందరావు కుమార్తె భవ్య కన్నీటిపర్యంతమయ్యారు. గతంలో తిరుపతి, కడపలో పనిచేసినా ఒత్తిడికి గురికాలేదని, తాడిపత్రిలో పని ఒత్తిడి ఎక్కువగా ఉందని తన తండ్రి చాలాసార్లు బాధపడ్డారని భవ్య తెలిపారు. ఈ క్రమంలోనే రాజకీయ ఒత్తిళ్లతోనే ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు.
ప్రభుత్వాసుపత్రిలో ఆనందరావు మృతదేహానికి నివాళులర్పించిన జేసీ…మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనందరావు సీఐగా బాధ్యతలు చేపట్టి 9 నెలలయిందని, సుమారు 5 నెలల నుంచి వైసీపీ నేతలు ఆయనను ఒత్తిళ్లకు గురిచేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలను కొన్ని కేసుల నుంచి తప్పించాలని ఆనందరావుపై ఒత్తిడి తెచ్చారని, దీంతో ఆనందరావు ఆత్మహత్యకు పాల్పడ్డారని షాకింగ్ కామెంట్స్ చేశారు.
మరోవైపు, ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ నాయకులపై నిందలు వేస్తున్నారని జేసీ ఆరోపణలను కొట్టిపారేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పోలీసులను ఎంత ఇబ్బందులకు గురి చేశారో తాడిపత్రి ప్రజలకు తెలుసని చెప్పారు. సీఐ మృతి బాధాకరమని, ఆయన ఆత్మహత్య ఘటనపై విచారణ చేయాలని ఉన్నతాధికారులను కోరతామని తెలిపారు. ఏది ఏమైనా, సీఐ ఆనందరావు ఆత్మహత్య వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది.
This post was last modified on July 3, 2023 10:28 pm
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…