అవినాశ్ రెడ్డి అరెస్ట్ భయం పోయింది.. పథకాలకు నిధులు కూడా అందుతున్నాయి.. మరి, ఇలాంటి సమయంలో జగన్ దిల్లీ ఎందుకు వెళ్తున్నట్లు? చాలామందిలో ఇదే అనుమానం ఉంది.
నారా లోకేశ్ పాదయాత్రతో భయపడి.. పవన్ వారాహి యాత్రతో వణికిపోతున్న జగన్ వాళ్లిద్దరూ మరింత పికప్ కాకముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఎలాగోలా చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగానైనా బయటపడి ఎన్నికలలో విజయం సాధించడానికి ప్లాన్ చేస్తున్నారని.. అందుకే దిల్లీ వెళ్తున్నారని టీడీపీ వర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కానీ.. అసలు విషయం వేరే ఉందని తెలుస్తోంది.
ముందస్తా.. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలా అనేది పెద్ద మ్యాటర్ కాదని జగన్ అనుకుంటున్నారట.. ఆయన కోరుకుంటున్నదంతా ఎన్నికలు ఒకే ఫేజ్‌లో జరగకూడదనే. అవును.. ఒకే దశలో కానీ, లేదంటే తక్కువ దశల్లో కాని జరిగితే పోల్ మేనేజ్‌మెంట్ కష్టమని.. ఎక్కువ ఫేజెస్ ఉంటే అంతా అనుకున్న ప్రకారం చేయొచ్చని భావిస్తున్నారట. అందుకే 7 ఫేజుల్లో ఎన్నికలు నిర్వహించేలా ఈసీఐ నుంచి సహకారం ఉండేలా చూడాలని కేంద్రంలోని బీజేపీ పెద్దలను జగన్ కోరనున్నారని.. అందుకే ఆయన దిల్లీ వెళ్తున్నారని తెలుస్తోంది.
2022లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాలను చూసుకుంటే గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌లలో సింగిల్ ఫేజ్‌లో ఎన్నికలు నిర్వహించారు. వీటిలో పంజాబ్ అసెంబ్లీలో 117 స్థానాలుంటాయి.. మిగతావన్నీ 100 లోపు సభ్యులున్న అసెంబ్లీలే. 2022లోనే ఎన్నికలు జరిగిన గుజరాత్‌లో రెండు ఫేజ్‌లలో.. మణిపుర్‌లో రెండు ఫేజ్‌లలో యూపీలో 7 ఫేజ్‌లలో ఎన్నికలు జరిగాయి. ఈ మూడు రాష్ట్రాలలో మణిపుర్ తప్ప మిగతా రెండూ ఏపీ కంటే ఎక్కువ సీట్లున్న అసెంబ్లీలే. గుజరాత్, యూపీలలో బీజేపీ మళ్లీ విజయం సాధించింది.
అంతకుముందు 2021లో 294 సీట్లున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు 8 ఫేజ్‌లలో నిర్వహించారు. ఆ ఎన్నికలలో బీజేపీ అక్కడ సుమారు 80 సీట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. కేంద్రం సహకారం, రాష్ట్రంలో సొంత ప్రభుత్వం ఉంటే ఎక్కువ ఫేజ్‌లలో ఎన్నికలు జరిగినప్పుడు లాభదాయకమన్నది ఒక అభిప్రాయం. ఒక్కో ఫేజ్‌పై దృష్టిపెడుతూ ఒకదాని తరువాత ఒకటి జాగ్రత్తగా పోల్ మేనేజ్మెంట్ చేయొచ్చు. ఈ కారణంగానే జగన్ 175 సీట్లున్న ఏపీలో 7 ఫేజ్‌లలో పోలింగ్ నిర్వహించాలని కోరుకుంటున్నారట.
అయితే.. జగన్ కోరుకుంటున్నట్లు ఏపీలో అన్ని ఫేజ్‌లకు ఎలక్షన్ కమిషన్ అంగీకరించడం కష్టమే. ఏపీ ఏమీ రాజకీయంగా మరీ అంత రావణ కాష్టం కాదు.. ఈశాన్య రాష్ట్రాలలా అంతర్గత హింస కూడా లేదు.. ఒకప్పటిలా మావోయిస్ట్ సమస్యా లేదు.. కాబట్టి ఈసీకి ఎన్నికల నిర్వహణ కష్టాలు పెద్దగా ఉండవు. అలాంటప్పుడు ఎక్కువ ఫేజ్‌లలో ఎన్నికలు నిర్వహిస్తే విమర్శలు కచ్చితంగా వస్తాయి. జగన్ కోసం ఈసీఐ అలాంటి పరిస్థితి తెచ్చుకోదు. అయితే.. జగన్‌కు కేంద్రంలోని బీజేపీ నుంచి సహకారం కనుక ఉంటే ఆ ఒత్తిడితో మూణ్నాలుగు ఫేజ్‌లకు ఈసీఐ ఓకే చెప్పొచ్చు. అదే జరిగితే జగన్ కోరుకున్నది జరిగినట్లే.
This post was last modified on July 2, 2023 4:12 pm
భోగి పండుగ రోజు ఉదయాన్నే మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తన ప్రత్యేక ప్రతిభను బయటపెట్టారు. కూటమి ప్రభుత్వాన్ని…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి ప్రశంసలు లభించాయి. గతంలోనూ పలు…
పండుగ అనగానే ఎవరైనా కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఏడాదంతా ఎంత బిజీగా ఉన్నా పండగ పూట.. కొంత సమయాన్ని ఫ్యామిలీకి…
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…