తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ టాప్ గేర్ వేస్తోంది. అన్ని జిల్లాలలో స్పీడ్ పెంచింది. ఇప్పటికే ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో జూపల్లి వంటి పవర్‌ఫుల్ లీడర్లను పార్టీలోకి లాగేసిన రేవంత్ రెడ్డి మరో కీలక నేతనూ కాంగ్రెస్‌లోకి తీసుకొస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో గత ఎన్నికలలో పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం ఖాయమని చెప్తున్నారు ఆయన అనుచరులు. చాలాకాలంగా బీజేపీలో చేరడానికి అన్ని ప్రయత్నాలు చేసిన సునీల్ రెడ్డికి అక్కడ అవకాశం లభించలేదు.. అదే సమయంలో కాంగ్రెస్ పుంజుకుంటుండడంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి సిగ్నల్స్ పంపిచారు. దాంతో రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి దిల్లీలో ఆయనతో చర్చలు జరిపారు. చేరికకు అంతా ఓకే అయినట్లు చెప్తున్నారు.
నిజానికి సునీల్ రెడ్డి ఇంతకుముందు బీజేపీలో చేరే ప్రయత్నం చేశారు. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు సంజయ్ కూడా సునీల్‌ను పార్టీలోకి తీసుకోవడానికి మొగ్గు చూపారు. కానీ, నిజామబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ నుంచి అభ్యంతరాలు రావడంతో ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేదు.
సునీల్ రెడ్డి 2018 ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీలో ఉండేవారు. బాల్కొండ అసెంబ్లీ టికెట్ ఆశించినప్పటికీ సిటింగ్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికే బీఆర్ఎస్ అధిష్ఠానం టికెట్ ఇచ్చింది. దీంతో సునీల్ రెడ్డి బీఎస్పీ టికెట్‌పై పోటీ చేశారు. ఆ ఎన్నికలలో సునీల్ గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు. ఆ తరువాత ప్రశాంత్ రెడ్డికి కేసీఆర్ తన మంత్రివర్గంలో స్థానమివ్వడంతో ప్రశాంత్ రెడ్డి పట్టు మరింత పెరగ్గా సునీల్ బీఆర్‌ఎస్ నుంచి పూర్తిగా దూరమయ్యారు.
బండి సంజయ్‌తో మంచి సంబంధాలున్న ఆయన బీజేపీలో చేరడానికి ప్రయత్నించినా ఆయనొస్తే నిజామాబాద్ ఎంపీ సీటు విషయంలో పోటీ కావొచ్చన్న భావనతో ధర్మపురి అరవింత్ అభ్యంతరం చెప్పడంతో ఆయన చేరిక ఆగిపోయింది.
తాజాగా దిల్లీలో కాంగ్రెస్ పెద్దలను పొంగులేటి, జూపల్లిలు కలిసి ప్రెస్ మీట్ పెట్టిన సమయంలోనే సునీల్ కూడా వచ్చి రేవంత్ సహా కొందరు నేతలను కలిసినట్లు చెప్తున్నారు. త్వరలో ఆయన చేరిక ఉంటుందని చెప్తున్నారు.
This post was last modified on July 1, 2023 10:28 am
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…
ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర నుంచి గ్లామర్ క్వీన్ ఇమేజ్ వైపు శరవేగంగా అడుగులేస్తున్న కథానాయిక కీర్తి సురేష్. దక్షిణాదిన…