Political News

‘సాయంత్రమైతే చాలు జగన్ పబ్జీ ఆడుకుంటారు’

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈసారి ఎలాగైనా సరే వైసీపీని ఓడించి టీడీపీని అధికారంలోకి తీసుకురావాల్సిందేనని చంద్ర‌బాబు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే యువగళం పేరుతో ఓ వైపు యువనేత నారా లోకేష్.. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు కష్టపడుతున్నారు. అయితే టీడీపీలోని కొందరు మాత్రం అసలు నియోజకవర్గంలో పట్టనట్లుగా.. పార్టీ కార్యక్రమాల్లో కూడా అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. ఈ విషయాలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. తాజాగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

‘రానున్న ఎన్నికల్లో 175కు 175 స్థానాల్లో గెలిచేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలి. పార్టీలో పనిచేయలేని వారుంటే ఇప్పుడే తప్పుకోవాలి. పనిచేయకుంటే కచ్చితంగా సీరియస్ యాక్షన్ ఉంటుంది. పార్టీ కార్యక్రమాల విషయంలో అలక్ష్యం వద్దు. తప్పు కునే వాళ్లు ఇప్పుడే తప్పుకుంటే వారిస్థానంలో వేరేవాళ్లను ప్లాన్ చేస్తాం. నేనేమీ గట్టిగా మాట్లాడటం లేదు.. పనిచేయకుంటే యాక్షన్ మాత్రమే తీసుకుంటానని చెబుతున్నాను’ అని తెలుగు తమ్ముళ్లను చంద్రబాబు ఒకింత గ‌ట్టిగానే హెచ్చరించారు. నిజానికి ఇప్ప‌టి వ‌రకు ఆయ‌న చూసీ చూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించినా.. ఇప్పుడు మాత్రం గ‌ట్టిగానే వార్నింగ్ ఇవ్వ‌డం సంచ‌ల‌నంగా మారింది.

నా అనుభ‌వ‌మంత వ‌య‌సు లేదు!

“నేను ముసలివాడినా..? జగన్‌కు నాకున్న అనుభవమంత వయస్సు లేదు. సాయంత్రమైతే చాలు జగన్ పబ్జీ ఆడుకుంటారు” అని చంద్ర‌బాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతేకాదు.. జగన్ కానీ.. వైసీపీ నేతలు గానీ ఏం మాట్లాడినా సరే టీడీపీ నుంచి స్ట్రాంగ్ కౌంటర్లు ఇవ్వాల‌ని ఆయ‌న నేత‌ల‌కు దిశానిర్దేశం చేశారు. మరోవైపు పాదయాత్రలో ప్రభుత్వ వైఫల్యాలను లోకేష్ ఎండగడుతూ.. టీడీపీ అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామనే దానిపై జనాలకు చెప్పుకుంటూ అడుగులు ముందుకేస్తున్నారని, ఆయ‌న‌ను చూసి అంద‌రూ స్ఫూర్తిగా ముందుకు నడ‌వాల‌ని సూచించారు.

త్వ‌ర‌లోనే మ‌రో మేనిఫెస్టో

త్వరలోనే మరో మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేయడానికి టీడీపీ సన్నాహాలు చేస్తున్న‌ట్టు చంద్ర‌బాబు చెప్పారు. టీడీపీ మేనిఫెస్టో ‘భవిష్యత్‌కు గ్యారెంటీ’ పై చైతన్య యాత్రను కూడా ప్రారంభించ‌నున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. ఇదిలావుంటే, చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్‌తో ఎంతమంది తెలుగు తమ్ముళ్లు దారిలోకొస్తారో చూడాల‌ని సీనియ‌ర్లు వ్యాఖ్యానించారు. అదేస‌మ‌యంలో ఎంతమంది పక్కకు తప్పుకుంటారో చూడాల‌ని కూడా చెబుతున్నారు. రాష్ట్రంలో సుమారు 60 నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ నాయ‌కులు ఉదాసీనంగా ఉన్నార‌ని చంద్ర‌బాబుకు తెలిపారు.

This post was last modified on June 20, 2023 7:03 am

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

3 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

4 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

4 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

4 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

5 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

5 hours ago