వైసీపీలో కీలక నాయకుడు, సీఎం జగన్‌కు ఒకప్పుడు రైట్ హ్యాండ్‌గా ఉన్న వి. విజయసాయిరెడ్డిని కొన్ని నెలలుగా పక్కన పెట్టేసిన విషయం తెలిసిందే.అయితే.. ఆయనను ఎందుకు పక్కన పెట్టారు? అనేది తరచుగా చర్చకు వస్తూనే ఉంది. కానీ, వైసీపీ నాయకులు ఎవరూ కూడా దీనిపై స్పందించిన పాపాన పోలేదు. ఇక, ఇప్పుడు తాజాగా టీడీపీ ఈ విషయంపై రియాక్ట్ అయింది. విజయసాయిరెడ్డిని వైసీపీ అధినేత ఎందుకు పక్కన పెట్టారనే విషయంపై టీడీపీ ఫైర్ బ్రాండ్ నేత బుద్దా వెంకన్న చెప్పుకొచ్చారు.
ఉత్తరాంధ్రలో శాంతిభద్రతలు క్షీణించాయని బుద్దా వెంకన్న అన్నారు. విశాఖ ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్‌పై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రెండేళ్లుగా ఉత్తరాంధ్ర టీడీపీ ఇన్చార్జ్‌గా వ్యవహరిస్తున్నానని, జగన్ సీఎం అయ్యాక రూ. 60 వేల కోట్ల భూ మాఫియా విశాఖ, పరిసర ప్రాంతాల్లో జరిగిందని ఆరోపించారు. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, విజయసాయిరెడ్డి, జగన్ కలిసే భూదందా నడిపించారని, ఈ భూ వివాదంపైనే విజయసాయి రెడ్డిని జగన్ పూర్తిగా పక్కన పెట్టేశారని అన్నారు.
ఇప్పుడు ఎంపీ సత్యనారాయణ వంతు రావడం వల్లే.. ఆయన కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేయించా రని, వాళ్ల పేరుతో ఉన్న భూములను తిరిగి రాయించుకునేందుకే ఈ కిడ్నాప్ చేశారని బుద్దా వెంకన్న అన్నారు. ఎంపీని కిడ్నాప్ చేయకుండా కుటుంబ సభ్యులను చేయడం ద్వారా ఏంపీని భయపెట్టాలని ప్లాన్ చేశారన్నారు. గతంలో దోచుకున్న లావాదేవీలపై తేడాలు వచ్చాయని ఎవరూ బయటకు చెప్పలేక పోతున్నారని, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.. కిడ్నాప్ ఉదంతాన్ని తేలిగ్గా తీసుకోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు.
అధికార పార్టీ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేయడం చిన్న విషయమా? అని ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో గొడ్డలి పోటును గుండె పోటు అన్నారని, ఇప్పుడు ఇదే తహాలో కిడ్నాప్ ఉదంతాన్ని కూడా మార్చ డానికి చూస్తున్నారని, సీబీఐ రంగలోకి దిగి.. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విశాఖలోనే అమిత్ షా కూడా జగన్ అవినీతి ముఖ్యమంత్రి అని చెప్పిన విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేశారు.
This post was last modified on June 18, 2023 5:24 pm
2009లో విడుదలైన బాలీవుడ్ మూవీ 3 ఇడియట్స్ ఒక సంచలనం. అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోని కాలేజీ స్టూడెంట్…
వైసీపీ మాజీ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి మళ్ళీ రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల…
ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయడం అన్నది పెద్ద రిస్క్‌గా మారిపోయిన మాట వాస్తవం. ఇంటర్నెట్, ఓటీటీల విప్లవం వల్ల…
టీడీపీ ఎంపీ, గుంటూరు పార్లమెంటు సభ్యుడు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో రాష్ట్రంలోని 25…
గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…
తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…