వైసీపీ ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ వెనుక జగన్:లోకేష్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర సాగుతోంది. ఈ సందర్భంగానే అనంతసాగరం జంక్షన్ లో బహిరంగ సభను నిర్వహించారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఈ సభలో పాల్గొన్నారు. ఆత్మకూరు నుంచి బరిలో దిగాలన్న ఆలోచనలో ఆనం ఉన్నారని తెలుస్తోంది.

ఈ సందర్భంగానే లోకేష్ పాదయాత్రలో ఆనం పాల్గొన్నాను. లోకేష్ యువగళానికి సంఘీభావం తెలిపి బహిరంగ సభలో పాల్గొన్నారు. సభలో జగన్ పై లోకేష్ నిప్పులు తిరగారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసింది జగన్ కు చెందిన మనుషులేనని లోకేష్ ఆరోపించారు. భూ కబ్జాల వాటాలలో తేడా వచ్చిందని, అందుకే ఈ కిడ్నాప్ డ్రామా నడిపించారని ఆరోపించారు. విశాఖను జగన్ క్రైమ్ కాపిటల్ చేశాడని అమిత్ షా అన్న వ్యాఖ్యలను లోకేష్ గుర్తు చేశారు.

జగన్ ఒక ఫెయిల్డ్ సీఎం అని, మంత్రి వేణుగోపాల్ పేషీలో సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని విమర్శించారు. బీసీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్ నుంచి వారికి జీతాలు రావాలని అని, అలా రాలేదు కాబట్టి ప్రభుత్వంతోపాటు కాపు, బీసీ కార్పొరేషన్ ఫెయిల్ అయ్యాయని అన్నారు. భవిష్యత్తుకు గ్యారటీ పేరుతో టిడిపి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టబోతుందని అన్నారు. చనిపోయిన గౌతమ్ రెడ్డి గారికి, ఆత్మకూరు నియోజకవర్గానికి జగన్ తీరని అన్యాయం చేశాడని, సెంచురీ ప్లై వుడ్ కంపెనీని ఆత్మకూరుకి తీసుకొస్తే జగన్ దానిని దొంగలా ఎత్తుకుపోయాడని, గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి లేకుండా జగన్ చేశాడని అన్నారు.