Categories: Political News

తెలంగాణలో కూడా ఉద్యోగులతో కటీఫేనా

తెలంగాణాలో అధికార బీఆర్ఎస్ కు ఉద్యోగులకు గ్యాప్ బాగా పెరిగిపోతున్నట్లుంది. దీనికి కారణం ఏమిటంటే పరస్పరం వ్యతిరేక భావన పెరిగిపోవటమే. ఉద్యోగులకు ఎంతచేసినా సంతృప్తి ఉండదని, ఉద్యోగులేమీ ప్రభుత్వానికి కృతజ్ఞతా భావంతో మద్దతుగా ఉండరనేది అధికారపార్టీ నేతల మనోభావన. ఇదే సమయంలో ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలు కావాలనే ప్రభుత్వం తీసుకుంటున్నదని ఉద్యోగసంఘాల నేతలు మండిపోతున్నారు. ఈ నేపధ్యంలోనే పీఆర్సీ కమిటి నియామకం, డీఏ బకాయిల విడుదల, హెల్త్ స్కీమ్ అమలు, బదిలీలు లాంటి అనేక అంశాలను కేసీయార్ పట్టించుకోవటంలేదు.

 

ఎక్కడైనా మాటలు చెప్పేటప్పుడు ఉద్యోగుల గురించి కేసీయార్ చాలా బ్రహ్మాండంగా చెబుతారు. ఆకాశానికి ఎత్తేస్తుంటారు. కానీ చేతల్లోకి వచ్చేటప్పటికీ అంతా శూన్యమే. మాటలకు విరుద్ధంగా ఉంటాయి కేసీయార్ చేతలు. అందుకనే కేసీయార్ ను కలవటానికి కూడా ఉద్యోగసంఘాల నేతలు పెద్దగా ఆసక్తిచూపరు. జూన్ తో 11వ పీఆర్సీ పదవీకాలం ముగుస్తోంది. జూలైలో 12వ పీఆర్సీ నియామకం జరగాలి. అయితే ఈ దిశగా కేసీయార్ ఇంతవరకు ఎలాంటి సమావేశం నిర్వహించలేదు. ఇదే విషయమై చీఫ్ సెక్రటరీ శాంతికుమారిని ఉద్యోగసంఘాల నేతలు కలిసినా ఉపయోగం కనబడలేదు.

 

రాబోయే ఎన్నికల్లో  ఉద్యోగుల స్టాండ్ ఎలాగుంటుందనే విషయమై కేసీయార్ సమాచారం తెప్పించుకున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే అందులో నెగిటివ్ ఫీడ్ బ్యాకే వచ్చిందట. 2018 ఎన్నికలకు ముందు పీఆర్సీ అమలుచేయకుండానే కేసీయార్ ఎన్నికలకు వెళ్ళిన దగ్గర నుండి ప్రభుత్వానికి ఉద్యోగులకు గ్యాప్ మొదలైంది. తమకు ఉద్యోగులు ఓట్లేయలేదనే ఫీడ్ బ్యాక్ కేసీయార్ కు ఉండటం వల్లే పీఆర్సీ వేయకుండా బాగా ఆలస్యంచేశారు. అయితే ఉద్యోగులు పెద్దఎత్తున ఒత్తిడి చేయటంతో పీఆర్సీ వేయాల్సొచ్చింది.

 

తర్వాత జరిగిన గ్రేటర్, ఎంఎల్సీ ఎన్నికల్లో కూడా ఫలితాలు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా వచ్చాయి. దాంతో ఉద్యోగులు తమకు వ్యతిరేకమే అని కేసీయార్ డిసైడ్ అయిపోయారు. ప్రభుత్వంపై ముఖ్యంగా టీచర్లు బాగా మంటగా ఉన్నారు. సాధారణ బదిలీలు, రిక్వెస్టు బదిలీలతో పాటు ప్రమోషన్ల విషయంలో కూడా ప్రభుత్వం టీచర్లను బాగా ఇబ్బందులు పెడుతోందని మండిపోతున్నారు. వీటన్నింటికీ అదనంగా జీతాలు కూడా నెలలో ఎప్పుడొస్తాయో తెలీటంలేదు. అందుకనే హోలు మొత్తంమీద ఉద్యోగులకు ప్రభుత్వానికి బాగా గ్యాప్ వచ్చేసినట్లు అర్ధమవుతోంది.

This post was last modified on June 15, 2023 12:59 pm

Share

Recent Posts

13 కోట్ల ఓట్లు ఎవరి అనుమతితో తొలగించారు?

కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…

42 minutes ago

ట్రబుల్ తట్టుకుని నిలబడుతుందా

రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…

59 minutes ago

గరివిడి లక్ష్మి చేస్తోంది పెద్ద సాహసమే

దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…

1 hour ago

అద్భుత ప్రయోగాల నిలయం ‘సింగీతం’

లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…

2 hours ago

ఒక్క పిల్ల‌ర్‌పైనే వైసీపీ భారం… !

వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న పార్టీ. ఈ పార్టీ ప్ర‌భావం నానాటికి త‌గ్గిపోతోంద‌న్న వాద‌న ఒక‌వైపు…

5 hours ago

తండ్రీ కొడుకుల వెరైటీ క్లాష్

బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…

6 hours ago