తెలంగాణాలో అధికార బీఆర్ఎస్ కు ఉద్యోగులకు గ్యాప్ బాగా పెరిగిపోతున్నట్లుంది. దీనికి కారణం ఏమిటంటే పరస్పరం వ్యతిరేక భావన పెరిగిపోవటమే. ఉద్యోగులకు ఎంతచేసినా సంతృప్తి ఉండదని, ఉద్యోగులేమీ ప్రభుత్వానికి కృతజ్ఞతా భావంతో మద్దతుగా ఉండరనేది అధికారపార్టీ నేతల మనోభావన. ఇదే సమయంలో ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలు కావాలనే ప్రభుత్వం తీసుకుంటున్నదని ఉద్యోగసంఘాల నేతలు మండిపోతున్నారు. ఈ నేపధ్యంలోనే పీఆర్సీ కమిటి నియామకం, డీఏ బకాయిల విడుదల, హెల్త్ స్కీమ్ అమలు, బదిలీలు లాంటి అనేక అంశాలను కేసీయార్ పట్టించుకోవటంలేదు.
ఎక్కడైనా మాటలు చెప్పేటప్పుడు ఉద్యోగుల గురించి కేసీయార్ చాలా బ్రహ్మాండంగా చెబుతారు. ఆకాశానికి ఎత్తేస్తుంటారు. కానీ చేతల్లోకి వచ్చేటప్పటికీ అంతా శూన్యమే. మాటలకు విరుద్ధంగా ఉంటాయి కేసీయార్ చేతలు. అందుకనే కేసీయార్ ను కలవటానికి కూడా ఉద్యోగసంఘాల నేతలు పెద్దగా ఆసక్తిచూపరు. జూన్ తో 11వ పీఆర్సీ పదవీకాలం ముగుస్తోంది. జూలైలో 12వ పీఆర్సీ నియామకం జరగాలి. అయితే ఈ దిశగా కేసీయార్ ఇంతవరకు ఎలాంటి సమావేశం నిర్వహించలేదు. ఇదే విషయమై చీఫ్ సెక్రటరీ శాంతికుమారిని ఉద్యోగసంఘాల నేతలు కలిసినా ఉపయోగం కనబడలేదు.
రాబోయే ఎన్నికల్లో ఉద్యోగుల స్టాండ్ ఎలాగుంటుందనే విషయమై కేసీయార్ సమాచారం తెప్పించుకున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే అందులో నెగిటివ్ ఫీడ్ బ్యాకే వచ్చిందట. 2018 ఎన్నికలకు ముందు పీఆర్సీ అమలుచేయకుండానే కేసీయార్ ఎన్నికలకు వెళ్ళిన దగ్గర నుండి ప్రభుత్వానికి ఉద్యోగులకు గ్యాప్ మొదలైంది. తమకు ఉద్యోగులు ఓట్లేయలేదనే ఫీడ్ బ్యాక్ కేసీయార్ కు ఉండటం వల్లే పీఆర్సీ వేయకుండా బాగా ఆలస్యంచేశారు. అయితే ఉద్యోగులు పెద్దఎత్తున ఒత్తిడి చేయటంతో పీఆర్సీ వేయాల్సొచ్చింది.
తర్వాత జరిగిన గ్రేటర్, ఎంఎల్సీ ఎన్నికల్లో కూడా ఫలితాలు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా వచ్చాయి. దాంతో ఉద్యోగులు తమకు వ్యతిరేకమే అని కేసీయార్ డిసైడ్ అయిపోయారు. ప్రభుత్వంపై ముఖ్యంగా టీచర్లు బాగా మంటగా ఉన్నారు. సాధారణ బదిలీలు, రిక్వెస్టు బదిలీలతో పాటు ప్రమోషన్ల విషయంలో కూడా ప్రభుత్వం టీచర్లను బాగా ఇబ్బందులు పెడుతోందని మండిపోతున్నారు. వీటన్నింటికీ అదనంగా జీతాలు కూడా నెలలో ఎప్పుడొస్తాయో తెలీటంలేదు. అందుకనే హోలు మొత్తంమీద ఉద్యోగులకు ప్రభుత్వానికి బాగా గ్యాప్ వచ్చేసినట్లు అర్ధమవుతోంది.
This post was last modified on June 15, 2023 12:59 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…