ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై చేద్దామని రెడ్ లో నటిస్తే పెద్దగా పట్టించుకోలేదు. ఇలా కాదు బోయపాటిని నమ్ముకుంటే తిరుగుండదని స్కంద చేస్తే అది కూడా వీటి దారే పట్టింది. సీక్వెల్ ట్రెండ్ నడుస్తోంది కదాని డబుల్ ఇస్మార్ట్ ట్రై చేస్తే దాని నష్టాల నుంచి కోలుకోవడానికి పూరి జగన్నాథ్ కు చాలా టైం పట్టింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అందరూ బాగానే ఉందన్న ఆంధ్రకింగ్ తాలూకా బోల్తా కొట్టడం నిజంగా షాకే. తనకే కాదు ఇండస్ట్రీనే దీన్నో కేస్ స్టడీలా చూసే పరిస్థితి వచ్చింది. కనీసం బ్రేక్ ఈవెన్ కాకపోవడం ఎవరూ ఊహించనిది.
ఈ సినిమా కోసం గీత రచయితగా మారిన రామ్ ఒక పాట రాసిన సంగతి తెలిసిందే. సాంగ్ బాగానే వెళ్ళింది కానీ లిరిక్స్ అయితే మరీ గొప్పగా లేవు. కాకపోతే ఒక నటుడు ఆ మాత్రం సాహిత్యం ఇవ్వడం గొప్ప విషయమే. ఇప్పుడీ పరిధి దాటి రామ్ స్వయంగా స్టోరీ రైటర్ కాబోతున్నాడని లేటెస్ట్ అప్డేట్. తనకు నచ్చేలా సూటయ్యేలా స్వంతంగా కథ రాసుకున్నాడట. పూర్తి సంతృప్తి కలిగాక అప్పుడు నిర్మాణ సంస్థ, దర్శకుడిని నిర్ణయించుకుంటాడని ఇన్ సైడ్ టాక్. ప్రస్తుతం ఒక కొత్త దర్శకుడితో హారర్ కామెడీ చేసే ఆలోచనలో ఉన్న రామ్ దానికి ఫైనల్ సిగ్నల్ ఇవ్వలేదు. ఓకే కాగానే అనౌన్స్ మెంట్ వస్తుందని వినికిడి.
ఇలా హీరోలే కథలు రాసుకోవడం, స్క్రిప్ట్ లో పాలు పంచుకోవడం కొత్త కాదు. కిరణ్ అబ్బవరం ఆల్రెడీ ఈ జాబితాలో ఉన్నాడు. ఒకప్పుడు కృష్ణ, ఎన్టీఆర్ లాంటి లెజెండరీ స్టార్స్ కథలు రాసుకున్న దాఖలాలు చాలా ఉన్నాయి. చిరంజీవి మృగరాజుకి కథ ఇచ్చింది నాగబాబే. అఫ్కోర్స్ అది హాలీవుడ్ మూవీ ఫ్రీ మేక్ కావడం వేరే విషయం. ఇప్పుడు రామ్ ఎలాంటి జానర్ లో సబ్జెక్టు రాసుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు కాబట్టి దీన్ని ప్రతిపాదన కిందే చూడాలి. తన స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం అభిమానులైతే ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాదైనా దక్కాలని వాళ్ళ కోరిక.
This post was last modified on December 16, 2025 6:08 pm
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…
అలియా భట్ ఎలా అన్ని బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తుందో చూసి చాలామందికి ఆశ్చర్యమే. కొత్త ఇల్లు, సినిమాలు, బిజినెస్ పనులు,…