ప్రముఖు మీడియా సంస్థ దక్కన్ క్రానికల్ సంస్థ మాజీ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. బుధవారం ఉదయం ఆయన్ను.. పీకే అయ్యర్.. డీసీ అడిటర్ మణి ఊమెన్ లను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకోవటం సంచలనంగా మారింది. బ్యాంక్ ను మోసం చేయటం.. మనీ లాండరింగ్ కేసులో ఆరోపణల్ని ఎదుర్కొంటున్నారు.
పలు బ్యాంకుల నుంచి రూ.8800 కోట్లను రుణం తీసుకున్న వెంకట్రామిరెడ్డి ఆ భారీ మొత్తాన్ని తిరిగి చెల్లించే విషయంలో ఫెయిల్ అయ్యారని కేసులు నమోదయ్యాయి. అయితే.. ఈ నిధులను దారి మళ్లించినట్లుగా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై సీబీఐ గతంలోనూ కేసు నమోదు చేసింది. ఈ కేసు ఆధారంగానే ఈడీ సైతం కేసు నమోదు చేసి.. విచారణ జరుపుతోంది. అందులో భాగంగానే తాజా అరెస్టులు జరిగినట్లుగా చెబుతున్నారు.
వెంకట్రామిరెడ్డికి చెందిన రూ.3300 కోట్ల ఆస్తుల్ని ఈడీ గతంలో జప్తు చేయటం గమనార్హం. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ప్రత్యేక కోర్టులో హాజరు పర్చిన అనంతరం రిమాండ్ కు తరలిస్తారు. కెనరా బ్యాంక్.. ఐడీబీఐ బ్యాంకుల నుంచి సుమారు రూ.1500 కోట్ల మేర మోసం చేసినట్లుగా వారిపై అభియోగాలు ఉన్నాయి. సంస్థకు చెందిన న్యూఢిల్లీ.. హైదరాబాద్.. గుర్ గావ్.. చెన్నై.. బెంగళూరులోని ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. ఈ ఉదంతం తాజాగా సంచలనంగా మారింది.
This post was last modified on June 14, 2023 12:04 pm
ఒకరేమో ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ ఫైవ్ లో కొనసాగుతున్నారు. మరొకరేమో... భారత ఐటీ రంగానికి సరికొత్త ఊపిరి ఊదిన…
దసరా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేతులు కలిపిన సంగతి…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం రాయచోటిలో జరిపిన పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటనపై సోషల్…
యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఏడాది గ్యాప్ వచ్చేసింది. ప్రభాస్ కోసం స్పిరిట్ స్క్రిప్ట్…
తెలంగాణలోని అదికార కాంగ్రెస్ లో తిరుగుబాటు బావుటా ఎగిరిందని, ఆ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా భేటీ…
ఒకప్పుడు అంటే పాతిక ముప్పై సంవత్సరాల క్రితం ప్రేక్షకులు పాటలు వినాలంటే ఆడియో క్యాసెట్లు ఎక్కువగా చెలామణిలో ఉండేవి. అంతకు…