చిలిచి చిలికి గాలవానలాగ అయ్యిందన్న సామెతలాగ అయిపోతోంది మహిళా రెజ్లర్ల వివాదం. మహిళా రెజ్లర్ల సహాఖ్యకు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అధ్యక్షుడు. చాలాకాలంగా బ్రిజ్ తమను లైగింకంగా వేధిస్తున్నట్లు మహిళా రెజ్లర్లు గడచిన 55 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. వీళ్ళెంత గోలచేసినా, ఆందోళనలు చేసినా నరేంద్రమోడీ ప్రభుత్వం ఏమాత్రం లెక్కచేయటంలేదు. ఏదో మొక్కుబడిగా క్రీడల శాఖామంత్రి అనురాగ్ ఠాకూర్ రెజ్లర్లతో ఈమధ్యనే మాట్లాడారు.
ఎవరెంత మాట్లాడినా ఎన్ని ప్రతిపాదనలు చేసినా రెజ్లర్ల డిమాండ్లలో ముఖ్యమైనది ఏమంటే బ్రిజ్ ను వెంటనే అరెస్టుచేయాలని. అయితే ఈ డిమాండ్ కు మాత్రం ప్రభుత్వం అంగీకరించటంలేదు. ఎందుకంటే ఈయనగారు ఉత్తరప్రదేశ్ లో ఎంపీ కూడా. కేంద్రప్రభుత్వానికి ఎన్నోరకాలుగా చాలా కావాల్సిన నేతట. అందుకనే జాతీయ, అంతర్జాతీయస్ధాయిలో ప్రభుత్వం పరువుపోతున్నా బ్రిజ్ మీద యాక్షన్ తీసుకునేందుకు మాత్రం మోడీ ఇష్టపడటంలేదు.
అందుకనే ఇలా లాభంలేదని అర్ధమైపోయి చివరకు తొందరలోనే జరగబోతున్న ఏషియా గేమ్స్ ను తామంతా బహిష్కరించబోతున్నట్లు వార్నింగ్ ఇచ్చారు. హర్యానాలోని సోనేపేట్ లో రెజ్లర్ల ఖాప్ పంచాయితి జరిగింది. ఈ పంచాయితీలో సాక్షిమాలిక్ మాట్లాడుతు ఈనెల 15వ తేదీలోగా బ్రిజ్ ను గనుక అరెస్టు చేయకపోతే తామంతా ఏషియా గేమ్స్ లో పాల్గనేదిలేదని చెప్పేసింది. ఈ నిర్ణయం అందరు కలిసి తీసుకున్నట్లు సాక్షి చెప్పింది.
మహిళా రెజ్లర్లు గనుక ఏషియా గేమ్స్ లో పాల్గొనకపోతే దేశానికి అదో పెద్ద బ్లాక్ మార్క్ అయిపోతుంది. ఎందుకని మహిళా రెజ్లర్లు ఏసియా గేమ్స్ ను బహిష్కరించారనే విషయంపై చర్చ జరుగుతుంది. అప్పుడు ప్రపంచదేశాల్లో బ్రిబ్ భూషణ్ లైంగిక వేధింపుల అంశమే ప్రధానమవుతుంది. ఇప్పటికే అంతర్జాతీయ ఫెడరేషన్ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులను ఖండించింది. ఇది సరిపోదన్నట్లుగా ఏషియా గేమ్స్ లో అన్నీ దేశాల్లోను ఇదే చర్చ మొదలవుతుంది. తమను లైంగింకంగా వేధిస్తున్నారంటు మహిళా రెజ్లర్లు చేస్తున్న ఆందోళనను మోడీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటంలేదో అర్ధంకావటంలేదు.
This post was last modified on June 11, 2023 12:19 pm
వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు…
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…